కరోనా టెస్టుల్లో ఇదే అత్యధికం
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ వేలకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా టెస్టుల నేపథ్యంలో ఈరోజు అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 4,20,898 పరీక్షలు నిర్వహించినట్టు బులెటిన్ విడుదల చేసింది. కాగా, ఈ స్థాయిలో భారత్‌లో టెస్టులో చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే , శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ వేలకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా టెస్టుల నేపథ్యంలో ఈరోజు అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 4,20,898 పరీక్షలు నిర్వహించినట్టు బులెటిన్ విడుదల చేసింది. కాగా, ఈ స్థాయిలో భారత్‌లో టెస్టులో చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
అయితే , శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసేపట్పికీ దేశవ్యాప్తంగా కొత్తగా 48,916 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం 13,36,861 మంది వైరస్ బారీన పడ్డారు. మహమ్మారిని జయించి 8,49,432 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 4,56,071 యాక్టివ్ కేసులు ఉన్నాయి.