నేడు జిల్లా కలెక్టర్ల సదస్సు..
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి తెలంగాణలోని అన్నిజిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్నఅభివృద్ధి పథకాలు పల్లె,పట్టణ ప్రగతి, హరితహారం, సంక్షేమ పథకాల అమలు ఏవిధంగా ఉంది.క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు, పరిశీలన జరుగుతుందా అనే అంశాలపైన చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్నరెవెన్యూ, మున్సిపల్ చట్టాలపైనా కలెక్టర్లకు అవగాహనా కల్పించి, భవిష్యత్తులో ప్రభుత్వం విజన్ ఎంటనేదానిపైనా వారికి వివరించనున్నట్టు […]
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి తెలంగాణలోని అన్నిజిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్నఅభివృద్ధి పథకాలు పల్లె,పట్టణ ప్రగతి, హరితహారం, సంక్షేమ పథకాల అమలు ఏవిధంగా ఉంది.క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు, పరిశీలన జరుగుతుందా అనే అంశాలపైన చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్నరెవెన్యూ, మున్సిపల్ చట్టాలపైనా కలెక్టర్లకు అవగాహనా కల్పించి, భవిష్యత్తులో ప్రభుత్వం విజన్ ఎంటనేదానిపైనా వారికి వివరించనున్నట్టు సమాచారం. అంతేకాకుండా జాయింట్ కలెక్టర్లను రద్దు చేసి అడిషనల్ కలెక్టర్ విధానాన్నితీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కొత్తగా వారికి ఏమైనా బాధ్యతలు అప్పజెప్పనున్నారా అనే దానిపైనా ఈ మీటింగ్‌లో ఓ క్లారిటీ రానుంది.