బెంగాల్ అప్‌డేట్: ఉత్కంఠంగా నందిగ్రామ్ ఫలితాలు
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా టీఎంసీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గం ఫలితాలు రసవత్తరంగా మారాయి. మమతా బెనర్జీ ప్రత్యర్థిగా బరిలో ఉన్న సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ మమతనే ఆధిక్యంలోకి వచ్చారు. టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఈ స్థానం నుంచి పోటీ చేయడం, సువేందు అధికారి తనపై గెలవాలని మమతకు సవాల్ విసిరి మరీ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా టీఎంసీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గం ఫలితాలు రసవత్తరంగా మారాయి. మమతా బెనర్జీ ప్రత్యర్థిగా బరిలో ఉన్న సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ మమతనే ఆధిక్యంలోకి వచ్చారు. టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఈ స్థానం నుంచి పోటీ చేయడం, సువేందు అధికారి తనపై గెలవాలని మమతకు సవాల్ విసిరి మరీ నందిగ్రామ్ నుంచి పోటీ చేయడంతో నంద్రిగామ్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అయితే.. మొదటి ఆరు రౌండ్ల వరకూ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి లీడ్ కొనసాగించారు. ఆ తర్వాత 7వ రౌండ్ నుంచి మమతా బెనర్జీ లీడ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో మొత్తంగా టీఎంసీ అభ్యర్థులు 208 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 80 స్థానాల్లో ఆధిక్యం కనభరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారం ఏర్పాటు చేయాలంటే కావాల్సింది.. 148 స్థానాలే కావున, పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా అనిపిస్తోంది. మరి చిరవకు ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి.