సందీప్ నాయకత్వానికి టీటా కౌన్సిల్ సపోర్ట్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల నాయకత్వం పట్ల అసోసియేషన్ సభ్యులు పూర్తి మద్దతు ప్రకటించారు. టీటా గ్లోబల్ కమిటీలకు దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా టీటా గ్లోబల్ గవర్నింగ్ కౌన్సిల్ అభిప్రాయం కోరగా ముందుగా జరిగిన ఎన్నికల ప్రకారం సందీప్ మక్తాల నాయకత్వం వహించాలని టెక్కీలు వారి అభిప్రాయాలను వెల్లడించారు. టీటా గ్లోబల్ కమిటీ గడువు గతేడాది డిసెంబర్ 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల నాయకత్వం పట్ల అసోసియేషన్ సభ్యులు పూర్తి మద్దతు ప్రకటించారు. టీటా గ్లోబల్ కమిటీలకు దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా టీటా గ్లోబల్ గవర్నింగ్ కౌన్సిల్ అభిప్రాయం కోరగా ముందుగా జరిగిన ఎన్నికల ప్రకారం సందీప్ మక్తాల నాయకత్వం వహించాలని టెక్కీలు వారి అభిప్రాయాలను వెల్లడించారు. టీటా గ్లోబల్ కమిటీ గడువు గతేడాది డిసెంబర్ 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధాన కమిటీ సహా అన్ని విభాగాలకు 22 దేశాల నుంచి వెయ్యికి పైగా నామినేషన్లు వచ్చాయి. 2018-22 కాలానికి గ్లోబల్ ప్రెసిడెంట్‌గా సందీప్ మక్తాల విజయం సాధించినప్పటికీ తన నాయకత్వం విషయంలో గవర్నింగ్ కౌన్సిల్‌ను సంప్రదించి వారి అభిప్రాయం తీసుకొని ముందుకు సాగాలని సందీప్ మక్తాల నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నింగ్ కౌన్సిల్ ఓటింగ్ నిర్వహించగా ఇందులో వంద శాతం సందీప్ మక్తాల నాయకత్వానికి మద్దతు తెలిపి గ్లోబల్ ప్రెసిడెంట్‌గా నాయకత్వం వహించాలని కోరారు. టీటాకు చెందిన కమిటీలలో మొదటి విడతలో గ్లోబల్ ఉపాధ్యక్షులుగా రాణాప్రతాప్ బొజ్జం, ప్రధాన కార్యదర్శులుగా అశ్విన్ చంద్ర వల్లబోజు, నవిన్ చింతల, కోశాధికారిగా రవి లేల్లను ప్రకటించారు. వారంలో మిగతా విభాగాల బాధ్యులను ప్రకటించనున్నారు.
బాధ్యతలు రెట్టింపయ్యాయి : సందీప్ మక్తాల
టీటా కమిటీలలో బాద్యతల స్వీకరణకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ రావడం సంతోషకరమని సందీప్ మక్తాల అన్నారు. వారంలో మిగతా కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. తన నాయకత్వానికి వంద శాతం మద్దతు తెలపడంతో తన బాధ్యతలు రెట్టింపయ్యాయన్నారు. కరోనా సమయంలో చేసిన టీ కన్సల్ట్, తెలంగాణ ఎర్లీ కోడర్స్‌కు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డులు దక్కాయని, 2021లోనూ అదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని ప్రకటించారు.