ధోనీకి మాస్క్ పెట్టిన తమిళ పోలీసులు

దిశ, స్పోర్ట్స్: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. ఈ సమయంలో ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. చాలాచోట్ల సెలబ్రిటీల ఫొటోలను పెట్టి ప్రచారం చేస్తున్నారు. ధోనీ ఫొటోను పెట్టి తమిళనాడు పోలీసులు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ఆ రాష్ట్రంలో లో ధోనీ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. కొన్ని రోజుల క్రితం ముంబయి పోలీసులు వాడిన క్యాప్షన్‌నే తిరుప్పూర్ పోలీసులు […]

Update: 2020-07-21 09:41 GMT

దిశ, స్పోర్ట్స్: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. ఈ సమయంలో ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. చాలాచోట్ల సెలబ్రిటీల ఫొటోలను పెట్టి ప్రచారం చేస్తున్నారు. ధోనీ ఫొటోను పెట్టి తమిళనాడు పోలీసులు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ఆ రాష్ట్రంలో లో ధోనీ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. కొన్ని రోజుల క్రితం ముంబయి పోలీసులు వాడిన క్యాప్షన్‌నే తిరుప్పూర్ పోలీసులు వాడుతున్నారు. సామాజిక దూరం పాటించాలని చెప్పేలా ధోనీ ఫొటోను వాడుతున్నారు. ధోనీ, రోహిత్ మైదానంలో ఉన్న ఫొటోలకు మాస్కులు ధరింపజేసి‘మెయింటైన్ సోషల్ డిస్టెన్స్’ అనే క్యాప్షన్‌తో ఫ్లెక్సీలు వేయించారు. ఇది సోషల్ మీడియాలో కూడా వైరలైంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీకి తమిళనాడులో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ని ముద్దుగా‘తాల’ అంటూ తమిళ అభిమానులు పిలుచుకుంటారు. ఇప్పటికే చెన్నైకి మూడుసార్లు టైటిల్ అందించాడు.

Tags:    

Similar News