టీమ్ ఇండియాపై ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ వివాదాస్పద వ్యాఖ్యలు

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాపై ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా 2-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత జట్టు అడిలైడ్ టెస్టులో కేవలం 36 పరుగులకే కుప్ప కూలి ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా.. గొప్ప పోరాటంతో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్నది. విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్లు లేకపోయినా.. యువకులే జట్టును గెలిపించారు. అయితే […]

Update: 2021-05-13 11:05 GMT
టీమ్ ఇండియాపై ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాపై ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా 2-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత జట్టు అడిలైడ్ టెస్టులో కేవలం 36 పరుగులకే కుప్ప కూలి ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా.. గొప్ప పోరాటంతో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్నది. విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్లు లేకపోయినా.. యువకులే జట్టును గెలిపించారు. అయితే టీమ్ ఇండియా తమను పక్కదారి పట్టించి మ్యాచ్‌లు గెలిచిందని టిమ్ పైన్ వ్యాఖ్యానించాడు.

‘పక్క దారి పట్టించడంలో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఏ మాత్రం ప్రాధాన్యత లేని అంశాలను తెరపైకి తెచ్చి మా ఏకాగ్రత చెడగొట్టింది. ఇలాంటి వాటిని ఎదుర్కోవడం సవాలు. ఉదాహరణకు వాళ్లు గబ్బాకు వెళ్లమని చెప్పారు. అప్పుడు మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో అర్దం కాని పరిస్థితుల్లో మేము ఉంటే… వాళ్లు గబ్బాకే వచ్చారు. ఇలాంటి పక్కదారి పట్టించే పనులతో మమ్మల్ని ఓడించారు.’ అని పైన్ పొంతన లేని వ్యాఖ్యలు చేశాడు. కాగా, పైన్ వ్యాఖ్యలను పలువురు తప్పు పడుతున్నారు. అలాంటి చిన్న చిన్న విషయాలకే ఏకాగ్రత చెడిపోతే ఎలా అంతర్జాతీయ క్రికెటర్ అవుతారని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News