‘జూమ్’ బరాబర్.. టిక్‘టాప్’
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం మోస్ట్ పాపులర్ యాప్స్ ఏంటో తెలుసా? తెలియదు కదూ ! అయితే మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫర్మ్ ‘సెన్సార్ టవర్స్’ లేటెస్ట్ రిపోర్ట్.. ఆ ట్రెండింగ్ యాప్స్ ఏంటో చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా మే నెలలో యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్లు చేసిన యాప్స్ ఏంటో ఆ నివేదికలో వెల్లడించింది. ఆ జాబితాలో ‘టిక్ టాక్’ టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకోగా, ఇండియాలో విడుదల చేసిన కరోనా ట్రేసింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’ కూడా అందులో చోటు […]
దిశ, వెబ్‌డెస్క్:
ప్రస్తుతం మోస్ట్ పాపులర్ యాప్స్ ఏంటో తెలుసా? తెలియదు కదూ ! అయితే మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫర్మ్ ‘సెన్సార్ టవర్స్’ లేటెస్ట్ రిపోర్ట్.. ఆ ట్రెండింగ్ యాప్స్ ఏంటో చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా మే నెలలో యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్లు చేసిన యాప్స్ ఏంటో ఆ నివేదికలో వెల్లడించింది. ఆ జాబితాలో ‘టిక్ టాక్’ టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకోగా, ఇండియాలో విడుదల చేసిన కరోనా ట్రేసింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’ కూడా అందులో చోటు సంపాదించుకుంది.
టిక్ టాక్ :
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌లో.. ఏప్రిల్ నెలలో జూమ్(131 మిలియన్లు) మొదటి ప్లేస్‌లో ఉండగా, టిక్ టాక్(107 మిలియన్లు) రెండో స్థానంలో నిలిచింది. మే నెలలో టిక్‌టాక్, జూమ్‌ను బీట్ చేసి ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో111.9 మిలియన్ల ఇన్‌స్టాల్స్ చేసుకున్నట్లు సెన్సార్ టవర్ రిపోర్ట్ వెల్లడించింది. ఇండియాలో ‘టిక్ టాక్’ యాప్‌తో సహా చైనా యాప్స్ రిమూవ్ చేయాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉద్యమం నడుస్తున్నప్పటికీ.. ఇండియా నుంచి ఎక్కువగా డౌన్‌లోడ్స్ జరిగినట్లు తెలిపింది. టిక్‌టాక్ టోటల్ డౌన్‌లోడ్స్‌లో ఇండియా కాంట్రిబ్యూషన్ 20 శాతం ఉండగా, యూఎస్ 9.3 శాతంగా ఉంది. కాగా టిక్‌టాక్‌ను మే నెలలో ఇండియా వ్యాప్తంగా 22.38 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
జూమ్ యాప్:
సెక్యూరిటీ కారణాలతో జూమ్ యాప్‌ను వాడొద్దంటూ భారత ప్రభుత్వం సూచించడంతో.. ఇక్కడ డౌన్‌లోడ్స్ తగ్గాయి. దీంతో మే నెలలో జూమ్ యాప్‌ను 94.6 మిలియన్ల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. కాగా జూమ్ డౌన్‌లోడ్స్‌లో ఇండియా, యూఎస్‌ల కాంట్రిబ్యూషన్ 17 శాతంగా ఉంది. మొత్తంగా ఇండియాలో జూమ్ యాప్‌ను మే నెలలో 16 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఆరోగ్య సేతు యాప్ :
సెన్సార్ టవర్ ‘మోస్ట్ పాపులర్ డౌన్‌లోడ్ యాప్స్ ఇన్ ద వరల్డ్’ లిస్టు ప్రకారం.. ఆరోగ్య సేతు యాప్ ఏడో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ను 116 మిలియన్ల డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ప్రముఖ మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్ ఈ లిస్టులో మూడో ప్లేస్‌లో ఉండగా, ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ మీట్, ఆరోగ్య సేతు, యూట్యూబ్, స్నాప్ చాట్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.