ఇక్కడ పిల్ల పులి సంచారం
దిశ, కాటారం: గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్దపులి అడుగు జాడలు కనిపించాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్ పల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం పెద్దపులి అడుగులు కనిపించాయి. యామన్ పల్లి పరిసర ప్రాంతాల్లో పులి అడుగుల గుర్తులను ఉన్నాయని స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పులి ఆనవాళ్లకు సంబంధించిన వివరాలను, ఫొటోలను సేకరించి వన్యప్రాణి సంరక్షణ విభాగానికి పంపించారు. నిపుణులు అడుగులను […]
దిశ, కాటారం: గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్దపులి అడుగు జాడలు కనిపించాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్ పల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం పెద్దపులి అడుగులు కనిపించాయి. యామన్ పల్లి పరిసర ప్రాంతాల్లో పులి అడుగుల గుర్తులను ఉన్నాయని స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పులి ఆనవాళ్లకు సంబంధించిన వివరాలను, ఫొటోలను సేకరించి వన్యప్రాణి సంరక్షణ విభాగానికి పంపించారు. నిపుణులు అడుగులను ఎనలైజ్ చేసి పూర్తి వివరాలను అందజేయనున్నారు. పెద్దపులితో పాటు పిల్ల పులి కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు. శనివారం నిమ్మగూడెంకు చెందిన నల్లగొండ సమ్మయ్య అనే రైతుకు చెందిన ఎద్దుపై పులి దాడి చేసి చంపినట్టు తెలిపారు. దశాబ్దాల తరువాత తూర్పు డివిజన్ పల్లెల్లో పెద్ద పులుల సంచారం వెలుగులోకి రావడంతో అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.