యాదాద్రి నరసింహ స్వామి భక్తులకు బిగ్ షాక్..

దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ముఖ్య గమనిక. నేటి నుంచి యాదాద్రిలో భక్తులు నిర్వహించే శాశ్వత, నిత్య పూజలతో పాటు, ప్రసాదాల ధరలు పెరిగాయి. ఈ మేరకు యాదాద్రి ఆలయ కార్యనిర్వహణ అధికారి గీత గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ.. కొవిడ్ వైరస్ కారణంగా ఆలయ ఆదాయం భారీగా తగ్గినట్టు వివరించారు. జీతభత్యాలతో ఆర్థికభారం పెరిగిన […]

Update: 2021-12-09 21:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ముఖ్య గమనిక. నేటి నుంచి యాదాద్రిలో భక్తులు నిర్వహించే శాశ్వత, నిత్య పూజలతో పాటు, ప్రసాదాల ధరలు పెరిగాయి. ఈ మేరకు యాదాద్రి ఆలయ కార్యనిర్వహణ అధికారి గీత గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ.. కొవిడ్ వైరస్ కారణంగా ఆలయ ఆదాయం భారీగా తగ్గినట్టు వివరించారు. జీతభత్యాలతో ఆర్థికభారం పెరిగిన కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఆలయంలో VVIPలు సత్యనారాయణ వ్రతాన్ని ప్రత్యేకంగా జరుపుకొనేందుకు అవకాశం కల్పిస్తూ టికెట్‌ ధరను రూ. 1,500గా నిర్ణయించారు. ఇంతకుముందు ఈ టికెట్‌ లేదు. అలాగే అష్టోత్తరం టికెట్‌ ధరను రూ. 100 నుంచి రూ. 200కి పెంచారు. 100 గ్రాముల లడ్డూ ధర రూ. 20నుంచి రూ. 30 నుంచి పెంచారు. అలాగే 500 గ్రాముల లడ్డూ ధర రూ. 100 నుంచి రూ. 150.. 250 గ్రాముల పులిహోర ప్యాకెట్‌ ధర రూ. 15 నుంచి రూ. 20, 250 గ్రాముల వడ రూ.15 నుంచి రూ.20కి పెంచారు. ఈ ధరలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి.

Tags:    

Similar News