డ్రగ్ కేసు.. నటి సోషల్ మీడియా స్టంట్!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం రేగుతుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ఎప్పుడు ఎవరికి నోటీసులు జారీ చేస్తుందో తెలియడం లేదు. కొందరు నటీనటులైతే తమ పేరు ఎక్కడ బయటకు వస్తుందో.. ఎక్కడ పరువు పోతుందో అని భయపడిపోతున్నారు. అదే సమయంలో చేయని పాపానికి కూడా ప్రతిఫలం చెల్లించుకోవాల్సి వస్తుందా? అనే భయం కూడా ఇంకొందరిలో కనిపిస్తోంది. అయితే నోటీసులు జారీ అయినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని.. దోషులుగా చూడకూడదని చెప్తోంది నటి టియా బాజ్ […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం రేగుతుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ఎప్పుడు ఎవరికి నోటీసులు జారీ చేస్తుందో తెలియడం లేదు. కొందరు నటీనటులైతే తమ పేరు ఎక్కడ బయటకు వస్తుందో.. ఎక్కడ పరువు పోతుందో అని భయపడిపోతున్నారు. అదే సమయంలో చేయని పాపానికి కూడా ప్రతిఫలం చెల్లించుకోవాల్సి వస్తుందా? అనే భయం కూడా ఇంకొందరిలో కనిపిస్తోంది. అయితే నోటీసులు జారీ అయినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని.. దోషులుగా చూడకూడదని చెప్తోంది నటి టియా బాజ్ పేయి.
ఇప్పటికే డ్రగ్ టెస్ట్ చేయించుకున్న ఆమె.. తనకు నెగెటివ్ వచ్చినట్లు మీడియా ముందు రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దీనిపై మీడియా అనవసర రాద్ధాంతం చేయకూడదని కోరింది. అసలు ఇదంతా ఎందుకు? కేవలం పబ్లిసిటీ కోసమే కదా అంటున్నారు నెటిజన్లు. ఫేమస్ అయ్యేందుకు అవకాశాన్ని చక్కగా యూజ్ చేసుకుంటోందని కామెంట్ చేస్తున్నారు. అసలు ఏ డ్రగ్ టెస్ట్ చేయించుకున్నావు? కొన్ని డ్రగ్స్ 24 గంటల్లోనే బ్లడ్ నుంచి వేరయిపోతాయి కదా! అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సోషల్ మీడియా స్టంట్ ఆపితే బాగుంటుందని చెప్తున్నారు.