ఆ రాశి వారికి కావాల్సినంత ధనం చేతికందుతుందట..

తేది : 24, జూన్ 2021 ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : గురువారం పక్షం : శుక్లపక్షం తిథి : పౌర్ణమి (ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 33 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 10 ని॥ వరకు) నక్షత్రం : జ్యేష్ట (నిన్న ఉదయం 11 […]

Update: 2021-06-23 11:33 GMT

తేది : 24, జూన్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పౌర్ణమి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 33 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 10 ని॥ వరకు)
నక్షత్రం : జ్యేష్ట
(నిన్న ఉదయం 11 గం॥ 49 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 9 గం॥ 12 ని॥ వరకు)
యోగము : శుభము
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : (సాయంత్రం 4 గం॥ 22 ని॥ నుంచి 5 గం॥ 47 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ( తెల్లవారు జాము 1 గం॥ 21 ని॥ నుంచి 2 గం॥ 46 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 10 గం॥ 6 ని॥ నుంచి 10 గం॥ 58 ని॥ వరకు)(సాయంత్రం 3 గం॥ 22 ని॥ నుంచి 4 గం॥ 14 ని॥ వరకు)
రాహుకాలం : (మధ్యాహ్నం 1 గం॥ 56 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 34 ని॥ వరకు)
గుళికకాలం : (ఉదయం 9 గం॥ 0 ని॥ నుంచి 10 గం॥ 38 ని॥ వరకు)
యమగండం : (ఉదయం 12 గం॥ 17 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 43 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 53 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : వృచ్చికం

మేషరాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. వ్యాపారస్తులు చాలా రోజుల తర్వాత మంచి లాభాలను చూస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి, వారితో ఆనందంగా గడుపుతారు. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయండి. కావాల్సినంత ధనం చేతికందుతుంది. పొదుపు చేస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగులు మీ సలహాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

వృషభ రాశి : ఆశావహ దృక్పథంతో ఆలోచించండి. ముఖ్యమైన పనులకు ఒక ప్రణాళిక వేయండి. మీ భార్య చెప్పేది వినడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులకు తగినంత సమయం కేటాయించండి వారితో గడపండి. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి. భాగస్వామ్య వ్యాపార విషయాలలో అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోండి. ఆఫీసులో పెండింగ్ పనులపై పై అధికారులతో మాటలు. ఈ రాశి స్త్రీలు వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చూస్తారు.

మిధున రాశి : ఆందోళన వలన సరి అయిన ఆలోచనలు రావు కమ్యూనికేషన్ చెయ్యలేరు. దైవ ప్రార్ధనల వలన బలం. ఆర్థిక విషయాలపై ఒక ముఖ్య వ్యక్తి సలహా తీసుకుంటారు. నిరుద్యోగులకు వారి శ్రమకు తగిన ఫలితం. ఆఫీసు పనులలో నూతన బాధ్యతలు వలన అధిక శ్రమ. పట్టుదలతో పనులను పూర్తిచేయండి. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్. ఆదాయం పరవాలేదు. అవసరాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఖర్చు చేయండి.అధిక శ్రమ వలన భుజాల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలు మరిచిపోండి, మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

కర్కాటక రాశి : ముఖ్యమైన పనుల కొరకు ఒక ప్రణాళిక వేయండి. లేకుంటే కొన్ని అవకాశాలను కోల్పోతారు. ఫిట్నెస్ కొరకు ప్రయత్నాలు చేయండి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. వారితో పరుషంగా వ్యవహరించ వద్దు. ఒక మొక్కను నాటండి. ఆఫీసు పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆదాయం పరవాలేదు. మీ తల్లి గారి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొండితనము మిమ్మల్ని బాధ పెడుతుంది.

సింహరాశి : అన్ని విధాలా అనుకూలమైన రోజు. ఒత్తిడిని అధిగమించండి. మీ వ్యక్తిగత జీవితంలోకి వేరొకరిని రానీయకండి. ముఖ్యమైన నిర్ణయాలు మీరే తీసుకోండి. ఆఫీసు పనులలో మీ సామర్థ్యంపై ప్రశంసలు. తోటి ఉద్యోగుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి. టీవి మొబైల్ వాడకం వలన సమయం వృధా. కావాల్సినంత ధనం చేతికందుతుంది. సరైన పథకాలలో పెట్టుబడులు పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కన్యారాశి : చిరునవ్వు సహనం మీ ఆయుధాలు. సహోదరుల సహాయం లభిస్తుంది. మరింత సంపాదన కొరకు అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోండి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్. కొంతమందికి ఉద్యోగ రీత్యా టూర్స్. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి. దాని వలన బంధాలు తెగుతాయి. ఆఫీసు పనులను సకాలంలో ప్రణాళికతో పూర్తిచేస్తారు. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలు మీ భర్తతో వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవి చూస్తారు.

తులారాశి : అతిగా ఆలోచించి గందరగోళంలో పడకండి. భయాలను వదలకపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆదాయ వ్యవహారాలు బాగున్నాయి కావలసిన ధనం చేతికందుతుంది. దుబారా ఖర్చులు చేయకండి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు ప్రయత్నాలు చేస్తారు. భార్యాభర్తల మధ్య విశ్వాసం పెంపొందించుకోండి. ఆఫీసులో మీ పని సామర్థ్యం మరియు పట్టుదల మీద ప్రశంసలు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అధిక శ్రమ వలన వెన్ను నొప్పి. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. గందరగోళం వదిలేయండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసు పనుల పట్ల నిర్లక్ష్యం వద్దు. బాధ్యత, పట్టుదలతో అన్ని పనులను పూర్తిచేయండి. ఆదాయం బాగున్నా అనవసరపు ఖర్చులు చేస్తారు. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి. వారు చెప్పేది వినండి. నూతన బాధ్యతల వలన ఆఫీసు పనులలో అధిక శ్రమ ఉన్నా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపటం లేదని బాధ పడతారు

ధనుస్సు రాశి : ఒత్తిడిని అధిగమించకపోతే అనారోగ్యం ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. వారు మీ జీవితంలో అతి ముఖ్యులు. వారితో గడపటం నీకెంతో ఎనర్జీ ని ఇస్తుంది. కొంతమందికి విదేశీ ప్రయాణ అవకాశం. అనుకోని ఖర్చులు వలన మానసిక అశాంతి. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. వ్యాపారస్తులు మీ ఎకౌంట్స్ ను సరిగా చూసుకోండి ఆడంబరాల కోసం ఖర్చు పెట్టకండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలు మరిచిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

మకర రాశి : ఆత్మవిశ్వాసము ధైర్యముతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. స్నేహితులు బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొంతమందికి ఉద్యోగంలో మార్పు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు. వ్యాపారస్తులు నూతన వ్యాపార పథకాల గురించి ఆలోచిస్తారు. కావాల్సినంత ధనం చేతికందుతుంది అనవసరపు దుబారా ఖర్చులను చేయకండి. ప్రముఖ వ్యక్తులతో పరిచయం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

కుంభరాశి : ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తారు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఊపిరి సలపని పనులతో బిజీగా ఉండటం ఒక మంచి ఉపాయం. కుటుంబ వ్యక్తులతో కలిసి కుటుంబ వ్యవహారాల గురించి చర్చిస్తారు. ఇంటిలో పెద్ద వారి సలహాలు తీసుకోండి. ఉద్యోగ మార్పుకు ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ. కొంతమందికి జీతాలలో పెరుగుదల. రహస్య కార్యకలాపాల వలన హాని. కావలసినంత ధనం చేతికందుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

మీన రాశి : శారీరక మానసిక ఆరోగ్యం కొరకు యోగా మెడిటేషన్ చేయండి. మీ భార్యతో సంయమనంగా మాట్లాడండి కుటుంబంలో ఆమె గొప్ప ను గుర్తించండి. కొంతమందికి విదేశీ ప్రయాణాలకు అవకాశం. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. ఆఫీసు పనుల పట్ల నిర్లక్ష్యం వహించకండి. పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆదాయ వ్యవహారాలు బాగున్నాయి రావలసిన బాకీలు వసూలవుతాయి. అనవసరపు ఖర్చులు నివారించండి. అధిక శ్రమ వలన కళ్ళకు ఇబ్బంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొండితనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

Tags:    

Similar News