గుట్ట పై ‘మైనింగ్’ ఆపాలని.. తెగించిన మూడు గ్రామాల ప్రజలు
దిశ, పాలకుర్తి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో గుట్ట పై మైనింగ్ పనులు ఆపాలని మూడు గ్రామాల ప్రజలు ఆదివారం ఆందోళకు దిగారు. నియోజకవర్గంలోని రాయపర్తి మండలం కొలనుపల్లి, ఆరేగూడెం, కేశవపురం గ్రామ రైతులు గుట్ట పై మైనింగ్ నిలిపివేయాలని రెండు గంటలుగా నిరసన తెలుపుతున్నారు. మైనింగ్ వలన మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నిమార్లు ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా వారు పట్టించుకోకపోవడంతో ఎట్టకేలకు గ్రామస్తులే రంగంలోకి దిగి […]
దిశ, పాలకుర్తి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో గుట్ట పై మైనింగ్ పనులు ఆపాలని మూడు గ్రామాల ప్రజలు ఆదివారం ఆందోళకు దిగారు. నియోజకవర్గంలోని రాయపర్తి మండలం కొలనుపల్లి, ఆరేగూడెం, కేశవపురం గ్రామ రైతులు గుట్ట పై మైనింగ్ నిలిపివేయాలని రెండు గంటలుగా నిరసన తెలుపుతున్నారు.
మైనింగ్ వలన మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నిమార్లు ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా వారు పట్టించుకోకపోవడంతో ఎట్టకేలకు గ్రామస్తులే రంగంలోకి దిగి మైనింగ్ కు వ్యతిరేకంగా గళమెత్తారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.