మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు కరోనా ఫ్రీ జిల్లాగా ముద్రపడ్డ మంచిర్యాల.. వలస కార్మికుల రూపంలో కరోనా బారిన పడింది. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం ముంబాయికి పుట్టకూటి కోసం వలస వెళ్లింది. లాక్‌డౌన్ కారణంగా ఆ కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. వీరికి థర్మల్ స్క్రీనింగ్ చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరిని బెల్లంపల్లి క్వారంటైన్ […]
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు కరోనా ఫ్రీ జిల్లాగా ముద్రపడ్డ మంచిర్యాల.. వలస కార్మికుల రూపంలో కరోనా బారిన పడింది. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం ముంబాయికి పుట్టకూటి కోసం వలస వెళ్లింది. లాక్‌డౌన్ కారణంగా ఆ కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. వీరికి థర్మల్ స్క్రీనింగ్ చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరిని బెల్లంపల్లి క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వీరి శాంపుల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపగా.. ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురిలో ఇద్దరు 70ఏళ్లు పైబడిన వారు కాగా, మరొకరు 30 ఏళ్ల యువకుడు. తాజాగా కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లాలో అలజడి మొదలైంది.