ట్రంపే కావాలంటున్న అమెరికన్స్..!

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్కంఠంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. 2021 జనవరి 20న అధ్యక్షుడి జోబైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలాహారీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇన్నిరోజులు వైట్ హోస్‌ను వదిలేది లేదని తేగెసి చెప్పిన ట్రంప్ ఎట్టకేలకు తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. తనంతటే తానే శ్వేతసౌధాన్ని విడిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ట్రంప్ ఓటమికి ఎన్నికారణాలున్నా.. డెమొక్రటిక్ పార్టీ కంటే అమెరికాలోని కీలక మైన రాష్ట్రాల్లో రిపబ్లికన్ […]

Update: 2020-11-14 20:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్కంఠంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. 2021 జనవరి 20న అధ్యక్షుడి జోబైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలాహారీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇన్నిరోజులు వైట్ హోస్‌ను వదిలేది లేదని తేగెసి చెప్పిన ట్రంప్ ఎట్టకేలకు తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. తనంతటే తానే శ్వేతసౌధాన్ని విడిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ట్రంప్ ఓటమికి ఎన్నికారణాలున్నా.. డెమొక్రటిక్ పార్టీ కంటే అమెరికాలోని కీలక మైన రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో అమెరికన్ కాంగ్రెస్‌లో రిపబ్లికన్ పార్టీకే అత్యధిక మెజార్టీ దక్కింది.

అయినప్పటికీ, కేవలం ఎలక్టరోల్ తక్కువగా రావడంతో ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్‌గా కొనసాగడం కలగానే మిగిలిపోయింది. ఇదిలాఉంటే, వాషింగ్టన్ రాష్ట్రంలో ట్రంప్‌కు మద్దతుగా వేలాది మంది అమెరికన్ పౌరులు నిరసనకు దిగారు. ట్రంప్ తోనే అమెరికా గొప్పశక్తిగా అవతరిస్తోందని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వెలువడిన ఫలితాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ట్రంప్ హయాంలో అమెరికా పౌరుల హక్కులకు పెద్దపీట వేయడమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News