వెంటనే ఆ సమస్యలను తీర్చాలి: గర్బిణి స్త్రీలు
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డిప్యుటేషన్ పై బదిలీ కావడంతో గైనకాలజిస్ట్ పోస్టు ఖాళీగా అయింది. ఈ ఆసుపత్రికి చుట్టుపక్కల నాలుగైదు మండలాల నుంచి గర్బిణి స్త్రీలు ప్రసవాల కోసం ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో డాక్టర్ వీణ సర్జరీ చేస్తుందనే నమ్మకంతో వచ్చేవారు. ఇప్పుడు ఆమె స్థానంలో సర్జరీలు చేసే గైనకాలజిస్ట్ డాక్టర్ ను త్వరగా నియమించాలని గర్బిణీ స్త్రీలు కోరుతున్నారు. అలాగే ఈ ఆస్పత్రిలో స్కానింగ్ […]
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డిప్యుటేషన్ పై బదిలీ కావడంతో గైనకాలజిస్ట్ పోస్టు ఖాళీగా అయింది. ఈ ఆసుపత్రికి చుట్టుపక్కల నాలుగైదు మండలాల నుంచి గర్బిణి స్త్రీలు ప్రసవాల కోసం ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో డాక్టర్ వీణ సర్జరీ చేస్తుందనే నమ్మకంతో వచ్చేవారు. ఇప్పుడు ఆమె స్థానంలో సర్జరీలు చేసే గైనకాలజిస్ట్ డాక్టర్ ను త్వరగా నియమించాలని గర్బిణీ స్త్రీలు కోరుతున్నారు. అలాగే ఈ ఆస్పత్రిలో స్కానింగ్ మిషన్ సమస్య ఉందని, గతంలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ వీణ బయటకు స్కానింగుకు రాసేవారని గర్భిణీ స్త్రీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కానింగ్ మిషన్ సమస్య కూడా తీర్చాలంటూ వారు అధికారులను విన్నవించుకుంటున్నారు.