ఆ 111 మంది తబ్లిగి జమాత్ మర్కజ్‌కి వెళ్లిన వాళ్లే: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని తబ్లిగి జమాత్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారితో పాటు వారితో సన్నిహితంగా ఉన్నవారికే కరోనా సోకుతోందని ఆయన వెల్లడించారు. అయితే కరోనా సోకిన వారిని పాపం చేసినట్టుగానో లేక తప్పు చేసిన వారిగా చూడవద్దని ఆయన సూచించారు. దేశాధినేతలకే కరోనా బాధలు తప్పడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన ముస్లిం బోధకులు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ […]

Update: 2020-04-02 05:36 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని తబ్లిగి జమాత్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారితో పాటు వారితో సన్నిహితంగా ఉన్నవారికే కరోనా సోకుతోందని ఆయన వెల్లడించారు. అయితే కరోనా సోకిన వారిని పాపం చేసినట్టుగానో లేక తప్పు చేసిన వారిగా చూడవద్దని ఆయన సూచించారు. దేశాధినేతలకే కరోనా బాధలు తప్పడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన ముస్లిం బోధకులు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 1085 మంది పాల్గొన్నారని ఆయన ప్రకటించారు. అందులో సుమారు 800 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని ఆయన చెప్పారు. వారిలో 111 కేసులు పాజిటివ్‌గా నిర్దారించబడ్డాయని ఆయన తెలిపారు. మిగిలిన కేసుల ఫలితాలు రావాల్సి ఉందని ఆయన చెప్పారు. ఢిల్లీలోని మత బోధకుల సమావేశాల్లో పాల్గొన్న వారిలో ఇంకో 21 మంది జాడ గుర్తించాల్సి ఉందని ఆయన వెల్లడించారు.

వీరిలో మెజారిటీ సభ్యులు హజ్రత్ నిజాముద్దీన్ ట్రైన్‌లో ప్రయాణించారని ఆయన చెప్పారు. అందువల్ల ఢిల్లీకి వెళ్లివచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వారితో ప్రయాణించిన వారు, వాళ్లను కాంటాక్ట్ అయిన వాళ్లు వెంటనే 104కు ఫోన్‌ చేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సమాజానికి చేటు చేసినవారవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మిగిలిన వారిని గుర్తించే పనిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందని చెప్పారు.

రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఒంట్లో బాగాలేకపోయినా వెంటనే స్థానిక ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని సీఎం పిలుపునిచ్చారు. గ్రామ వలంటీర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బందితో ఇంటింటి సర్వే చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆరోగ్య సమస్య ఉంటే వారి దృష్టికి తేవాలని చెప్పారు. అలాంటి వారికి సంబంధిత పరీక్షలు చేయడమే కాకుండా, మందులు కూడా ఇస్తారని చెప్పారు. ఆరోగ్యం విషమిస్తే నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్తారని ఆయన సూచించారు.

జ్వరం, గొంతునొప్పి, దగ్గు ఉంటే వెంటనే 104కు ఫోన్ చేసి చెప్పాలని ఆయన తెలిపారు. వెంటనే చికిత్స చేయించుకొని స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం వద్దన్నారు. దానివల్ల కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారికి కూడా మేలు జరుగుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి నయమైనట్టు రిపోర్టులు ఉన్నాయని, అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

ఈ ఆపత్కర పరిస్ధితుల్లో ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ సంక్షోభ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యుల సేవలు చాలా అవసరమని ఆయన తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ కరోనా నివారణ చర్యల్లో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగాలు ప్రైవేట్ ఆసుపత్రుల సహాయాన్ని కోరాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే పాత జీవోను వెలికి తీసిన జగన్… 500 ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తున్న్టటు వెల్లడించారు.

Tags: tabligi jamat markaz, new delhi, nijamuddin, ysrcp, andhrapradesh, cm jagan,

Tags:    

Similar News