‘వెనిస్ చిత్రోత్సవం’లో తొలిసారిగా గుజరాతి షార్ట్ ఫిల్మ్!

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని పురాతమైన ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ‘వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ ఒకటి. ఈ చిత్రోత్సవానికి మొదటిసారిగా ఓ గుజరాతి షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. ఆ సినిమా పేరు ‘అనిత’. ఈ చిత్రానికి సుష్మ ఖడేపౌన్ దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా ఈ ఏడాది మే నెలలో కేన్స్‌ చిత్రోత్సవం నిర్వహించలేదు. వచ్చే ఏడాది జరిగే గోల్డెన్‌ గ్లోబ్స్, ఆస్కార్‌ అవార్డులను వాయిదా వేశారు. ఈ ఏడాది జరగాల్సిన కొన్ని ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ను వర్చువల్‌గా (ఆన్‌లైన్‌లో) […]

Update: 2020-09-06 05:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని పురాతమైన ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ‘వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ ఒకటి. ఈ చిత్రోత్సవానికి మొదటిసారిగా ఓ గుజరాతి షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. ఆ సినిమా పేరు ‘అనిత’. ఈ చిత్రానికి సుష్మ ఖడేపౌన్ దర్శకత్వం వహించారు.

కరోనా కారణంగా ఈ ఏడాది మే నెలలో కేన్స్‌ చిత్రోత్సవం నిర్వహించలేదు. వచ్చే ఏడాది జరిగే గోల్డెన్‌ గ్లోబ్స్, ఆస్కార్‌ అవార్డులను వాయిదా వేశారు. ఈ ఏడాది జరగాల్సిన కొన్ని ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ను వర్చువల్‌గా (ఆన్‌లైన్‌లో) జరపడానికి నిశ్చయించారు. అయితే వెనిస్‌ చిత్రోత్సవాలను కొవిడ్‌ గైడ్‌‌‌లైన్స్‌ పాటిస్తూ నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న ప్రారంభమై, 12వ తేదీ వరకు జరగనున్న ఈ ఫెస్టివల్‌‌లో సుమారు 50 దేశాలు పాల్గొనబోతున్నాయి. అయితే ఈ చిత్రోత్సవంలో తొలిసారి గుజరాతి షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనకు ఎంపిక కావడం విశేషం.

జెండర్ బయాస్, గృహ హింస నేపథ్యంలో 18 నిమిషాల నిడివితో తెరకెక్కిన ‘అనిత’ సినిమాను గుజరాత్‌లోని వల్సాద్ సిటీలో చిత్రీకరించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ సుష్మ ఇండో అమెరికన్ కాగా.. ఆమె సూరత్‌లో జన్మించింది. కొలంబియా యూనివర్సిటీలో డైరెక్షన్ కోర్సుతో పాటు స్క్రీన్ రైటింగ్ కూడా నేర్చుకుంది.

లాక్‌డౌన్ తర్వాత ‘వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్’ తొలిసారిగా జరుగుతోంది. కాగా, ఈ ఫెస్టివల్‌లో ఇండియా నుంచి ‘అనిత’ షార్ట్ ఫిల్మ్‌తో పాటు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ చైతన్య తమ్హానే దర్శకత్వంలో రూపొందిన ‘డిసిపుల్’ (disciple), ఫిల్మ్ మేకర్ ఇవన్ అయ్యర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మైల్ పత్తర్’లు ఎంపికయ్యాయి.

Tags:    

Similar News