మహిళా నువ్వు గ్రేట్.. 22 ఏళ్లుగా ఆటో డ్రైవర్‌గా హవా

దిశ, ఫీచర్స్ : మహిళలు ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితం కాగా, ప్రస్తుతం తాము కూడా తగ్గేదే లే అన్నట్లు అన్ని పనుల్లోనూ తమదైన ప్రతిభ చాటుతున్నారు. ఈ మేరకు బస్, లారీ డ్రైవర్లుగా, మెకానిక్స్‌గానూ రాణిస్తుండగా, తమిళనాడులోని విల్లుపురానికి చెందిన 43 ఏళ్ల చిత్ర 22 ఏళ్ల క్రితమే ఆటోడ్రైవర్‌‌గా మారింది. రెండు దశాబ్దాలుగా ఎన్నో అవమానాలను, సమాజ వివక్షను తట్టుకుని ఆమె నిలబడిన వైనం ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి.. […]

Update: 2021-12-26 02:38 GMT

దిశ, ఫీచర్స్ : మహిళలు ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితం కాగా, ప్రస్తుతం తాము కూడా తగ్గేదే లే అన్నట్లు అన్ని పనుల్లోనూ తమదైన ప్రతిభ చాటుతున్నారు. ఈ మేరకు బస్, లారీ డ్రైవర్లుగా, మెకానిక్స్‌గానూ రాణిస్తుండగా, తమిళనాడులోని విల్లుపురానికి చెందిన 43 ఏళ్ల చిత్ర 22 ఏళ్ల క్రితమే ఆటోడ్రైవర్‌‌గా మారింది. రెండు దశాబ్దాలుగా ఎన్నో అవమానాలను, సమాజ వివక్షను తట్టుకుని ఆమె నిలబడిన వైనం ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం.

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి.. 1999లో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ అందించడం ప్రారంభించింది. ఆ సమయంలో 21 ఏళ్ల చిత్ర ఆటోరిక్షా స్టీరింగ్ పట్టుకోగా, ఇప్పటికీ ఆ రంగంలో తిరుగులేని ఆటోడ్రైవర్‌గా ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్రయాణంలో పట్టణానికి చెందిన ఎంతోమంది ప్రేమాభిమానాలను సంపాదించుకోగా, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు, విద్యార్థులు ఆమెకు విశ్వసనీయ కస్టమర్స్‌గా ఉన్నారు. అయితే ఈ రోజుల్లో కూడా ఓ మహిళ ఆటో నడుపుతున్న తీరును చూసి జనాలు షాక్ అవుతున్నారు. జెండర్ కారణంగా ప్రయాణీకులు చిత్ర డ్రైవింగ్ నైపుణ్యాలను తక్కువగా అంచనా వేసిన సందర్భాలు ఉండగా, ఆ జాబితాలో పోలీసులు కూడా ఉన్నారు. లింగ వివక్ష కూడా రేట్లపై ప్రభావం చూపుతుందని, మేల్ డ్రైవర్‌కు చెల్లించే దానికంటే చాలా తక్కువ ధరలను రైడ్ కోసం డిమాండ్ చేస్తుంటారని చిత్ర చెప్పింది. ఇక ఆటోరిక్షా నుంచి బరువైన వస్తువులను లోడ్, అన్‌లోడ్ చేసే విషయంలోనూ పురుషుల సహాయాన్ని ఆమె నిరాకరిస్తుంది.

మహిళలు ఆటో నడుపుతున్నారంటే.. పురుషులు ఆ విషయాన్ని వెటకారంగా తీసుకోవడంతో పాటు, ఆటో ఎక్కేందుకు ఆలోచిస్తుంటారు. కానీ మహిళా ప్రయాణికులు మాత్రం మహిళా డ్రైవర్ సహవాసంలో పూర్తిగా సురక్షితంగా భావిస్తారు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.300-400 ఆదాయం వస్తే, పండుగల సమయంలో అంతకు రెండు, మూడురెట్లు ఎక్కువగా సంపాదిస్తాను. డ్రైవర్‌గా నా దినచర్య ఉదయం 4.30 మొదలైతే, సాయంత్రం వరకు కొనసాగుతోంది. అయితే మహిళా కస్టమర్స్‌లో ఎవరికైనా రవాణా అవసరమైతే, అర్థరాత్రి వరకు అందులోబాటులో ఉంటాను. ఈ విషయంలో కొందరు మహిళలు అర్థరాత్రి ఆటో రైడ్స్ గురించి భయపడతారు, అందుకే వారి అవసరార్థం ఏ టైమ్‌లోనైనా నా సేవలు అందిస్తాను. రెండు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నాను, ఇప్పటికీ కూడా విల్లుపురం పట్టణంలో ఓ మహిళ ఆటోరిక్షా నడపడం అసాధారణంగానే ఉంది. ఉద్యోగంతో సంబంధం లేకుండా మహిళలు తమకు కావలసినది చేసేంత శక్తివంతులని నేను భావిస్తున్నాను కాబట్టి నేనే చేస్తాను.

– చిత్ర, ఆటోడ్రైవర్

Tags:    

Similar News