ఆ పార్క్ అందాలకు ఫిదా
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌తో పోల్చి చూస్తే, విదేశాల్లోని ఇళ్ల నిర్మాణ శైలిలో తేడాలున్నట్లే.. ఫారిన్ పార్కులకు, ఇక్కడి పార్కులకు కూడా తేడాలుంటాయి. అయితే కేరళ, కోజికొడ్ జిల్లాలోని కరాక్కడ్‌లో కొత్తగా నిర్మించిన ‘వాగ్భాతానంద’ పార్క్ మాత్రం సరికొత్త రూపురేఖలతో అందరినీ ఆకట్టుకుంటోంది. డిజైనింగ్ కొత్తగా ఉండటంతో పాటు ఫారిన్ నిర్మాణ శైలి, లైటింగ్ అరేంజ్‌మెంట్, కలర్ కాంబినేషన్ పార్క్‌కు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. యూరోపియన్ సిటినీ తలపించేలా ఉందని నెటిజన్లతో సహా, స్థానిక ప్రజలు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌తో పోల్చి చూస్తే, విదేశాల్లోని ఇళ్ల నిర్మాణ శైలిలో తేడాలున్నట్లే.. ఫారిన్ పార్కులకు, ఇక్కడి పార్కులకు కూడా తేడాలుంటాయి. అయితే కేరళ, కోజికొడ్ జిల్లాలోని కరాక్కడ్‌లో కొత్తగా నిర్మించిన ‘వాగ్భాతానంద’ పార్క్ మాత్రం సరికొత్త రూపురేఖలతో అందరినీ ఆకట్టుకుంటోంది. డిజైనింగ్ కొత్తగా ఉండటంతో పాటు ఫారిన్ నిర్మాణ శైలి, లైటింగ్ అరేంజ్‌మెంట్, కలర్ కాంబినేషన్ పార్క్‌కు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. యూరోపియన్ సిటినీ తలపించేలా ఉందని నెటిజన్లతో సహా, స్థానిక ప్రజలు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక ఈ పార్క్ నిర్మాణం కోసం కేరళ టూరిజం శాఖ 2.8 కోట్ల రూపాయలు వెచ్చించింది.
ఇందులో లీజర్ సెంటర్, జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, పబ్లిక్ వెల్ టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అంతేకాదు విజువల్లీ ఇంపెయిర్డ్, దివ్యాంగుల సౌకర్యార్థం ఈ నిర్మాణంలో ప్రత్యేకమైన టైల్స్ ఉపయోగించడం విశేషం. కాగా ఒంచియాం-నాదపురం రోడ్‌లో నిర్మించిన ఈ స్టన్నింగ్ అండ్ బ్యూటిఫుల్ పార్క్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మనదేశంలో నిర్మించే పార్క్‌లకు ఈ పార్క్ మోడల్‌ను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ రిఫార్మర్ వాగ్భాతనంద జ్ఞాపకార్థం ఈ పార్క్‌ను నిర్మించారు.
Vagbhatananda Park at Karakkad, Vadakara is now open to public.
The park is built by @KeralaTourism dept. in memory of renaissance hero & social reformer Vagbhatananda guru. The park has leisure center, gym, badminton court, public well, toilet & sidewalk among other facilities. pic.twitter.com/gB50sIGtsn
— Kadakampally Surendran (@kadakampalli) January 6, 2021