ఇదెక్కడి వింత.. తాబేలును మింగిన చేప..

దిశ, వెబ్ డెస్క్ : కొన్ని విషయాలు వింటున్నప్పుడు అది నిజమేనా అనే భావన కలుగుతుంది. అలాంటిది జరగడంసాధ్యమేనా అని మనం అనుకుంటాం. అలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. అది ఏంటో మీరు కూడా తెలుసుకోండి. బ్రతికున్న ఓ చేప కడుపులో ఓ తాబేలును శాస్త్రవేత్తలు గుర్తించారు. వినడానికే విడ్డూరంగా ఉంది కదా.. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. పెద్ద నోరు ఉన్న చేప కడుపులో బయోలజిస్టులు ఓ తాబేలును […]

Update: 2021-03-06 09:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : కొన్ని విషయాలు వింటున్నప్పుడు అది నిజమేనా అనే భావన కలుగుతుంది. అలాంటిది జరగడంసాధ్యమేనా అని మనం అనుకుంటాం. అలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. అది ఏంటో మీరు కూడా తెలుసుకోండి. బ్రతికున్న ఓ చేప కడుపులో ఓ తాబేలును శాస్త్రవేత్తలు గుర్తించారు. వినడానికే విడ్డూరంగా ఉంది కదా..

ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. పెద్ద నోరు ఉన్న చేప కడుపులో బయోలజిస్టులు ఓ తాబేలును గుర్తించడమే కాకుండా.. అది బతికే ఉందని తెలపడం కొసమెరుపు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఫ్లోరిడాలోని ఫిష్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ బయోలజిస్టులు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అందులో భాగంగా తాము చేప కడుపులో ఉన్న తాబేలును ఎలా గుర్తించామో కూడా వివరించారు.

బయోలజిస్టులు కొద్ది రోజుల క్రితం ఓ చెరువులో లార్జ్‌మౌత్‌ బాష్‌ చేపను పట్టుకున్నారు. అనంతరం దాన్ని ల్యాబ్‌కు తెచ్చి పరిశోధనలు ప్రారంభించారు. ఈ క్రమంలో బయోలజిస్టులు ఆ చేపకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలని భావించారు. ఈ సందర్భంగా ఆ చేప కడుపులో ఏదో కదులుతున్నట్టుగా వారు గుర్తించారు. దీంతో చేప నోటిని తెరిచి చూడగా.. ఓ తాబేలును చూసి షాక్‌కు గురయ్యారు. అనంతరం ఆ తాబేలుును.. అతి జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ వింత ఘటనపై బయోలజిస్టులు మాట్లాడుతూ.. ఇలాంటి అరుదైన విషయం తమకు వింత కలిగించిందని పేర్కొన్నారు.

 

Tags:    

Similar News