సూపర్ మూన్ చూసేందుకు ఫ్లైట్ జర్నీ

దిశ, ఫీచర్స్ : కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో చాలా దేశాలు ‘విమాన’ రాకపోకలపై ఆంక్షలు విధించాయి. దాంతో ఇతర దేశాలకు ప్రయాణాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎయిర్‌లైన్ సర్వీసెస్ కూడా బాగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రావెలర్స్‌‌కు యూనిక్ ఎక్స్‌పీరియన్స్ అందివ్వడంతో పాటు తమకు కూడా లాభాదాయకంగా ఉండేలా ఆస్ట్రేలియా వైమానిక సంస్థ ‘క్వాంటాస్’ ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ‘ఫ్లైట్ టు నో వేర్’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా క్వాంటాస్ […]

Update: 2021-05-14 01:21 GMT

దిశ, ఫీచర్స్ : కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో చాలా దేశాలు ‘విమాన’ రాకపోకలపై ఆంక్షలు విధించాయి. దాంతో ఇతర దేశాలకు ప్రయాణాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎయిర్‌లైన్ సర్వీసెస్ కూడా బాగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రావెలర్స్‌‌కు యూనిక్ ఎక్స్‌పీరియన్స్ అందివ్వడంతో పాటు తమకు కూడా లాభాదాయకంగా ఉండేలా ఆస్ట్రేలియా వైమానిక సంస్థ ‘క్వాంటాస్’ ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ‘ఫ్లైట్ టు నో వేర్’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా క్వాంటాస్ ఎయిర్‌వేస్ తమ పౌరులను ఉత్సాహపరచాలని నిర్ణయించుకుంది.

‘ఫ్లైట్ టు నో వేర్’ అంటే ఎక్కడికీ వెళ్లకుండా ఉండటం కాదు. సరిహద్దులు దాటకుండా తమ దేశంలోనే ప్రయాణించడం. గత ఏడాది పాండెమిక్ కారణంగా ఇంటికి పరిమితమైన వారిలో ఉత్సాహం నింపడానికి ఈ కాన్సెప్ట్ తెరమీదకు వచ్చింది. కాగా క్వాంటాస్ ఎయిర్‌వేస్ తమ ప్యాసింజర్స్‌ను మూడు గంటల పాటు ఆకాశంలో స్వేచ్ఛ విహారానికి తీసుకెళుతుంది. అంతేకాదు.. 2021లో రెండోసారి కనివిందు చేయనున్న ‘సూపర్ బ్లడ్ మూన్’ను చూసే అవకాశం కూడా వారికి కల్పిస్తుంది. ఈ క్రమంలోనే 40వేల ఎత్తులో సూపర్ మూన్‌గా దగ్గరగా వారిని తీసుకెళ్లి ఓ యూనిక్ ఎక్స్‌పీరియన్స్ వారికి అందించనుంది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కొన్ని పసిఫిక్ ప్రాంతాలతో పాటు యూఎస్ వెస్ట్ కోస్ట్‌లో కొంత భాగం నుంచి సూపర్ మూన్ కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అందువల్ల పసిఫిక్ మహాసముద్రం మీదుగా ‘సూపర్ మూన్’ వీక్షించేందుకు సరైన రూట్ మ్యాప్ అందించేందుకు ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ వెనెస్సా మోస్‌తో కలిసి క్వాంటాస్ పనిచేస్తుంది. ఈ ప్రయాణంలో వెనెస్సా మోస్ కూడా భాగస్వామ్యం కానున్నాడు. ఈ ప్రయాణానికి ‘బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌’ ఎంపిక చేయగా, దాని పెద్ద కిటికీలు చంద్రుడ్ని చూడటానికి ఎంతో అనువుగా ఉంటాయని క్వాంటాస్ పేర్కొంది. ఇక ఈ ప్రయాణానికి ధర 500 డాలర్ల నుంచి 1500 డాలర్ల మధ్య ఉండగా, కేవలం 100 మంది ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ విమానానికి సంబంధించిన అన్ని టికెట్లు కేవలం 2.5 నిముషాల్లో (రికార్డు సమయంలో) అమ్ముడైనట్లు క్వాంటాస్ ప్రకటించింది.

మే 26 ఆకాశంలో జరిగే అద్భుతాన్ని ‘సూపర్ బ్లడ్ మూన్ ఎక్లిప్స్’గా నాసా అభివర్ణించింది. ఆ రోజున చంద్రుడు భూమికి అతి దగ్గరలో (357,311 కిలోమీటర్లు) కనువిందు చేయనున్నాడు.

 

Tags:    

Similar News