టీఆర్ఎస్ నేతలకు షాక్.. హోటల్ గదిలో అలా జరగడంతో కలకలం

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇన్ని రోజులూ స్తబ్ధుగా ఉన్నా గురువారం ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే అది ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చే వార్త. రాజకీయ మలుపులతో కాదండోయ్.. ఒక ఎమ్మెల్యే 100 మంది ప్రతినిధులతో కలిసి యాదాద్రి ప్రధానాలయ ప్రాంగణంలోకి వెళ్లగా.. ఇదీ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు క్యాంపు పాలిటిక్స్ కోసం వెళ్లిన ఓ అధికార పార్టీ నేతకు చెందిన నగదు హోటల్ గదిలో […]

Update: 2021-12-09 09:51 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇన్ని రోజులూ స్తబ్ధుగా ఉన్నా గురువారం ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే అది ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చే వార్త. రాజకీయ మలుపులతో కాదండోయ్.. ఒక ఎమ్మెల్యే 100 మంది ప్రతినిధులతో కలిసి యాదాద్రి ప్రధానాలయ ప్రాంగణంలోకి వెళ్లగా.. ఇదీ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు క్యాంపు పాలిటిక్స్ కోసం వెళ్లిన ఓ అధికార పార్టీ నేతకు చెందిన నగదు హోటల్ గదిలో మాయం కావడం ఒక్కసారిగా కలకలం రేపింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్‌లో మకాం వేశారు. ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన ఓటర్లను నిరంతరం పర్యవేక్షించి.. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు కొంతమంది నేతలు సైతం వెళ్లారు. అయితే ఈ క్యాంపులోని ఓ నేతకు చెందిన రూ.50 వేలు హోటల్ గదిలో మాయమయ్యాయి. ఆ డబ్బును హోటల్ సిబ్బందే తీశారంటూ ఏకంగా వారితో గొడవ పెట్టుకున్నారని సమాచారం. క్యాంపు కోసమని వెళితే.. ఉన్న డబ్బు పోయిందంటూ పొలిటికల్ సైటర్లు జోరుగా నడుస్తున్నాయి.

Tags:    

Similar News