ఆ ఒక్క కారణంతో పెళ్ళైనా మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదట
దిశ, వెబ్ డెస్క్: మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఓ జంట కోర్టుకెక్కింది. ఇప్పుడా అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన భార్యాభర్తలు మే 28, 1981న వివాహం చేసుకున్నారు. వారు పెళ్లి చేసుకునే నాటికి భార్యకు 18 సంవత్సరాలు, భర్త 21 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉన్నారు. అయితే, వీరు ఇటీవల ఢిల్లీ ప్రభుత్వానికి మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, భర్త వయస్సు భార్య వయస్సు కంటే […]
దిశ, వెబ్ డెస్క్: మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఓ జంట కోర్టుకెక్కింది. ఇప్పుడా అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన భార్యాభర్తలు మే 28, 1981న వివాహం చేసుకున్నారు. వారు పెళ్లి చేసుకునే నాటికి భార్యకు 18 సంవత్సరాలు, భర్త 21 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉన్నారు. అయితే, వీరు ఇటీవల ఢిల్లీ ప్రభుత్వానికి మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, భర్త వయస్సు భార్య వయస్సు కంటే తక్కువగా ఉన్నందున కంప్యూటర్ యాక్సెప్ట్ చేయలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నది.