మొదటి డోసు తర్వాతే ఈ టీకాలు సూపర్ ఎఫెక్టివ్
న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా సంస్థలు అభివృద్ధి చేసిన రెండు టీకాలు మొదటి డోసు తర్వాతే సూపర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్‌ను ఇస్తున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. ఫైజర్, మొడెర్నా టీకాలు తొలి డోసు తర్వాత ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయని రియల్ వరల్డ్ యూఎస్ అధ్యయనం పేర్కొంది. ఈ రెండు టీకాల తొలి డోసు వేసుకున్న రెండు వారాల తర్వాత కరోనా నుంచి 80శాతం మేర రక్షణ కల్పిస్తున్నాయని వివరించింది. కాగా, రెండో డోసు తీసుకున్న మూడో వారం తర్వాత నుంచి […]
న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా సంస్థలు అభివృద్ధి చేసిన రెండు టీకాలు మొదటి డోసు తర్వాతే సూపర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్‌ను ఇస్తున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. ఫైజర్, మొడెర్నా టీకాలు తొలి డోసు తర్వాత ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయని రియల్ వరల్డ్ యూఎస్ అధ్యయనం పేర్కొంది. ఈ రెండు టీకాల తొలి డోసు వేసుకున్న రెండు వారాల తర్వాత కరోనా నుంచి 80శాతం మేర రక్షణ కల్పిస్తున్నాయని వివరించింది. కాగా, రెండో డోసు తీసుకున్న మూడో వారం తర్వాత నుంచి కరోనా నుంచి 90శాతం రక్షణ కల్పిస్తుననాయని తెలిపింది.
అమెరికాలో నాలుగు వేల మందిని ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. తొలి డోసు తర్వాతే ఈ టీకాలు పనిచేస్తున్నాయన్న క్రితం అధ్యయనాలను తాజా పరిశీలన కన్ఫామ్ చేసింది. అంతేకాదు, అసింప్టోమాటిక్ ఇన్ఫెక్షన్‌నూ ఈ టీకాలు నివారిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఫైజర్, మొడెర్నా టీకాలు రెండు డోసుల రెజిమెన్‌లు. ఈ రెండు టీకాలు ఎంఆర్‌ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసినవి కావడం గమనార్హం.