ఢిల్లీలో లాక్‌డౌన్ ఉండదు : కేజ్రీవాల్

న్యూఢిల్లీ:  కరోనా ఉధృతి నేపథ్యంలో దేశ రాజధానిలో లాక్ డౌన్ విధించనున్నారన్న వార్తలను ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఢిల్లీలో త్వరలో కొత్త ఆంక్షలను అమలు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పది రోజులకు సరిపడా కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవసరమైనన్ని వ్యాక్సిన్ డోసులు కేంద్రం పంపితే వ్యాక్సిన్‌పై వయోపరిమితిని ఎత్తివేస్తామని, వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను పెంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. కాగా ఢిల్లీలో ప్రస్తుతం […]

Update: 2021-04-10 04:19 GMT

న్యూఢిల్లీ: కరోనా ఉధృతి నేపథ్యంలో దేశ రాజధానిలో లాక్ డౌన్ విధించనున్నారన్న వార్తలను ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఢిల్లీలో త్వరలో కొత్త ఆంక్షలను అమలు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పది రోజులకు సరిపడా కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవసరమైనన్ని వ్యాక్సిన్ డోసులు కేంద్రం పంపితే వ్యాక్సిన్‌పై వయోపరిమితిని ఎత్తివేస్తామని, వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను పెంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. కాగా ఢిల్లీలో ప్రస్తుతం కరోనా ఫోర్త్ వేవ్ నడుస్తోందన్నారు. అందువల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Tags:    

Similar News