మానవత్వం లేదా మీకు.. కేసీఆర్‌పై కేసు నమోదు చేయండి..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ సర్కారు ఏపీ అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటోందంటూ బీజేపీ మహిళా నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే ఆపేసి ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సర్కారు తీరుతో సరిహద్దుల వద్ద పలువురు రోగులు మృత్యుముఖానికి చేరువయ్యే పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి గాను తెలంగాణ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం […]

Update: 2021-05-14 05:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ సర్కారు ఏపీ అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటోందంటూ బీజేపీ మహిళా నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే ఆపేసి ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ పాలకుల తీరును అందరూ తప్పుబడుతున్నా ప్రభుత్వం స్పందించడంలేదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తీరు వల్ల సరిహద్దు్ల్లో కరోనా బాధితులు మృతి చెందరాని.. వారి మృతికి కారణమైన సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేసినా తప్పులేదని విమర్శించారు. బోర్డర్‌లో అంబులెన్సులను ఆపేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయా? అన్న హైకోర్టు ప్రశ్నకు.. అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని వెల్లడించారు. ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మ్ చేసుకున్నా, అందుకు రుజువులు చూపిస్తున్నా అనుమతించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

 

Tags:    

Similar News