చార్జీలలో ఎలాంటి మార్పులు లేవు

దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ బస్‌ చార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని రవా‌ణా‌శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఓఆర్ 50-60 మాత్రమే ఉందని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో ఆర్టీసీకి రూ. 2వేల కోట్ల నష్టం వచ్చినట్టు ఆయ న వెల్లడించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అంత రాష్ట్ర ఒప్పందం ఇప్పుడు కుదిరిందని ఆయన అన్నారు. రెండు కార్పొరేషన్లకు లాభం కలిగించే విధంగా ఈ ఒప్పందం ఉందని తెలిపారు. ఇరు […]

Update: 2020-11-02 07:21 GMT

దిశ, వెబ్ డెస్క్:
ఆర్టీసీ బస్‌ చార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని రవా‌ణా‌శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఓఆర్ 50-60 మాత్రమే ఉందని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో ఆర్టీసీకి రూ. 2వేల కోట్ల నష్టం వచ్చినట్టు ఆయ న వెల్లడించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అంత రాష్ట్ర ఒప్పందం ఇప్పుడు కుదిరిందని ఆయన అన్నారు. రెండు కార్పొరేషన్లకు లాభం కలిగించే విధంగా ఈ ఒప్పందం ఉందని తెలిపారు. ఇరు రాష్ట్రాల మద్య బస్సు సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించారు.

Tags:    

Similar News