పురుషుల్లో సన్నాసులు ఉన్నారు.. మహిళల్లో అద్భుత ప్రతిభ

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళలు ఎక్కడైతే రక్షించ.. పూజించబడుతారో ఆ దేశం బాగుపడుతుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. సంక్షేమ తీర్మానం ఆమోదం సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల సంతోషంగా ఉంటే అక్కడ దేవతలు సంచరిస్తారని, వాస్తవానికి ఇండియాలో మహిళకు సరైన గౌవరం లేదన్నారు. ప్రతిభ ఉన్న వాళ్లలో మహిళలు కూడా ఉన్నారని, టాలెంట్ ఉన్న మహిళలకు తగిన ప్రాధాన్యం ఇచ్చిన్నపుడే దేశం బాగుపడుతుందని, అప్పటి వరకు దేశం బాగుపడదని స్పష్టం చేశారు. […]

Update: 2021-10-25 11:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళలు ఎక్కడైతే రక్షించ.. పూజించబడుతారో ఆ దేశం బాగుపడుతుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. సంక్షేమ తీర్మానం ఆమోదం సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల సంతోషంగా ఉంటే అక్కడ దేవతలు సంచరిస్తారని, వాస్తవానికి ఇండియాలో మహిళకు సరైన గౌవరం లేదన్నారు. ప్రతిభ ఉన్న వాళ్లలో మహిళలు కూడా ఉన్నారని, టాలెంట్ ఉన్న మహిళలకు తగిన ప్రాధాన్యం ఇచ్చిన్నపుడే దేశం బాగుపడుతుందని, అప్పటి వరకు దేశం బాగుపడదని స్పష్టం చేశారు.

పురుషుల్లో కూడా సన్నాసులు ఉన్నారని పేర్కొన్నారు. మహిళల్లో ఐక్యూ ఉన్నవారు ఉత్పాదక రంగంలో, తక్కువ ఐక్యూ ఉన్నవారు అన్ ఉత్పాదక రంగంలో ఉంటున్నారన్నారు. మహిళల టాలెంట్‌కు పదును పెట్టాలని సూచించారు. మహిళలకు మంచి పదవులు ఇవ్వాలి.. అక్కడి నుంచి రత్నాలు వస్తారు.. అని పేర్కొన్నారు. అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని త్వరలో దీనిపై సమగ్ర విధానం, మంచి కార్యాచరణతో ముందుకు వస్తామన్నారు. అనాథలు తారసపడితే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంటుకు సమాచారం అందజేయాలని ప్రతినిధులకు సూచించారు.

Tags:    

Similar News