గ్రామాల్లో జోరుగా సాగుతున్న దందా.. ఆబ్కారీ అధికారుల అండదండలతోనే..!

దిశ, సదాశివపేట: సదాశివపేట పరిధిలో జోరుగా బెల్ట్ షాపుల దందా నడుస్తుంది. మందుబాబులకు ఏ సమయంలో కావాలన్న మందు విచ్చలవిడిగా దొరుకుతుంది. సదాశివపేట పట్టణ పరిధిలో ఉన్న కొన్ని పాన్ షాప్‌లలో, ఫ్యాక్టరీల దగ్గర ఉన్న ధర కంటే 50 రూపాయల వరకు ఎక్కువ రేట్‌కు అమ్ముతున్నారు. మండల పరిధిలోని సగం గ్రామాలలో ఈ బెల్టు షాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్నాయి. బెల్ట్ షాపులు నడిపేవారు.. మందుబాబులకు ఫోన్ పే, గూగుల్ పే సదుపాయాన్ని […]

Update: 2021-12-14 06:37 GMT

దిశ, సదాశివపేట: సదాశివపేట పరిధిలో జోరుగా బెల్ట్ షాపుల దందా నడుస్తుంది. మందుబాబులకు ఏ సమయంలో కావాలన్న మందు విచ్చలవిడిగా దొరుకుతుంది. సదాశివపేట పట్టణ పరిధిలో ఉన్న కొన్ని పాన్ షాప్‌లలో, ఫ్యాక్టరీల దగ్గర ఉన్న ధర కంటే 50 రూపాయల వరకు ఎక్కువ రేట్‌కు అమ్ముతున్నారు. మండల పరిధిలోని సగం గ్రామాలలో ఈ బెల్టు షాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్నాయి. బెల్ట్ షాపులు నడిపేవారు.. మందుబాబులకు ఫోన్ పే, గూగుల్ పే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి రిపోర్టర్లు ఫోన్ చేసినా అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఉక్కుపాదం మోపి బెల్టుషాపుల దందాను ఆపాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News