LockDown :లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన యువకుడు.. సమాధానం విని పోలీసులు షాక్
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, కొందరు మాత్రం లాక్‌డౌన్‌ను బ్రేక్ చేస్తూ బయట తిరుగుతున్నారు. పోలీసులు వారిని అడ్డగించడంతో సిల్లీ రీజన్స్ చెబుతూ.. లాఠీ దెబ్బలు తింటున్నారు. సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీవీఆర్ చౌరస్తా వద్ద ఓ వ్యక్తి లాక్‌డౌన్ సమయంలో బైక్ మీద బయటకు వచ్చి పోలీసులకు దొరికాడు. దీంతో పోలీసులు.. బయటకు ఎందుకు వచ్చావ్ అని అడగ్గా.. ‘సార్.. ఇంట్లో […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, కొందరు మాత్రం లాక్‌డౌన్‌ను బ్రేక్ చేస్తూ బయట తిరుగుతున్నారు. పోలీసులు వారిని అడ్డగించడంతో సిల్లీ రీజన్స్ చెబుతూ.. లాఠీ దెబ్బలు తింటున్నారు.
సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీవీఆర్ చౌరస్తా వద్ద ఓ వ్యక్తి లాక్‌డౌన్ సమయంలో బైక్ మీద బయటకు వచ్చి పోలీసులకు దొరికాడు. దీంతో పోలీసులు.. బయటకు ఎందుకు వచ్చావ్ అని అడగ్గా.. ‘సార్.. ఇంట్లో ఖాళీగా కూర్చోవడంతో తిన్నది అరగడం లేదు.. మా ఇంట్లోవాళ్లందరికీ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చింది. అందుకే ఈనో ప్యాకెట్లు కొనేందుకు బయటకు వచ్చాను..’ అంటూ సమాధానం చెప్పాడు.
లాక్‌డౌన్ కారణంగా తనతో పాటు తన తండ్రి, సోదరుడు, భార్య ఇంట్లోనే ఉంటున్నామని, తిని కూర్చుంటుండటంతో అరగడం లేదని.. అందుకే ఈనో ప్యాకెట్లు తీసుకుని వెళ్తున్నానంటూ సమాధానమిచ్చాడు. బ్యాగులో ఉన్న ఈనో ప్యాకెట్లను చూపించాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.