కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్న యువకుడు

దిశ, మేడ్చల్: లాక్‌డౌన్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ యువకుడు పోలీసులపై తిరగబడిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో చోటుచేసుకుంది. పోలీసులు మౌలాలిలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. శుక్రవారం అక్కడ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా ఓ యువకుడు తన తల్లితో కలిసి వాహనంపై వచ్చాడు. పోలీసులు ఆపి తనీఖీలు చేసే క్రమంలో వివాదం నెలకొంది. దీంతో యువకుడు తల్లితో కలిసి ఏకంగా […]

Update: 2020-04-03 09:52 GMT

దిశ, మేడ్చల్: లాక్‌డౌన్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ యువకుడు పోలీసులపై తిరగబడిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో చోటుచేసుకుంది. పోలీసులు మౌలాలిలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. శుక్రవారం అక్కడ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా ఓ యువకుడు తన తల్లితో కలిసి వాహనంపై వచ్చాడు. పోలీసులు ఆపి తనీఖీలు చేసే క్రమంలో వివాదం నెలకొంది. దీంతో యువకుడు తల్లితో కలిసి ఏకంగా పోలీసు కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు పోలీసులకు, యువకుడు, తల్లికి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం యువకుడిని పోలీసులు వాహనం ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు.

tag: lockdown, young man, holding, constable’s collar, moulali

Tags:    

Similar News