కూతురు, అల్లుడు, అత్త.. మధ్యలో చేపల పులుసు ట్విస్ట్
దిశ, వెబ్‌డెస్క్: వారు ఒకరికొకరు ప్రాణంగా ప్రేముంచుకున్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్టుగానే వారి ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్ధం తో ఒక్కటయ్యారు. ఇంకొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు అనగా మృత్యువు వారి ఇంట కలకలం రేపింది. అనుమానాస్పద రీతిలో వరుడు మృత్యువాత పాడడం ఆ పెళ్లి ఇంట తీరని శోకాన్ని మిగిల్చింది. అత్తవారింట తిన్న చేపల కూర ఆ వరుడును చంపిందా..? లేక పెళ్లి ఇష్టంలేదని వధువు తల్లిదండ్రులే అతడిని మట్టుబెట్టారా..? […]
దిశ, వెబ్‌డెస్క్: వారు ఒకరికొకరు ప్రాణంగా ప్రేముంచుకున్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్టుగానే వారి ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్ధం తో ఒక్కటయ్యారు. ఇంకొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు అనగా మృత్యువు వారి ఇంట కలకలం రేపింది. అనుమానాస్పద రీతిలో వరుడు మృత్యువాత పాడడం ఆ పెళ్లి ఇంట తీరని శోకాన్ని మిగిల్చింది. అత్తవారింట తిన్న చేపల కూర ఆ వరుడును చంపిందా..? లేక పెళ్లి ఇష్టంలేదని వధువు తల్లిదండ్రులే అతడిని మట్టుబెట్టారా..? ఈ విషాద ఘటన కేరళలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం.. కేరళ రాష్ట్రం, ఇడుక్కి జిల్లా, మూనారు ప్రాంతానికి చెందిన నిషాంత్ (30) చెన్నైలోని ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.
గత కొన్నేళ్లుగా నిషాంత్ తమిళనాడులోని అరియలూరు జిల్లా గంగైకొండచోళపురం ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అతడి ప్రేమకు ఓకే చెప్పడంర్హో ఇద్దరు పెళ్ళికి సిద్ధమయ్యారు. ముందు వధువు తల్లిదండ్రులు వివాహానికి నిరాకరించగా, నిషాంత్ వారిని ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక మే 17 న వీరి వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. ఇదిలావుండగా కరోనా రెండో వైరస్ కారణంగా నిషాంత్ పని చేస్తున్న కార్యాలయానికి సెలవు ప్రకటించారు. దీంతో ఆటను సొంతూరుకు వెళ్లలేక.. అత్తవారింటికి వచ్చాడు. అల్లుడు వచ్చాడని అత్తగారు చేపల పులుసు చేసి పెట్టింది. ఇక చేపల కూరతో భోజనం చేసిన నిషాంత్ కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు. దీంతో వెంటనే నిషాంత్ ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అతడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో ఇరు కుటుంబ వర్గాల్లో విషాదం నెలకొంది. అయితే ఇంట్లో చేపల పులుసు తిన్న ఎవరికి ఏమి కాకుండా ఒక్క నిషాంత్ కి మాత్రమే ఇలా కావడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నిషాంత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వధువు తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తమకే పాపం తెలియదని, సొంత అల్లుడిని మేము చంపుకుంటామా..? అని వధువు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుడు మృతికి గల కారణాలను త్వరలోనే తెలుసుకొంటామని పోలీసులు తెలిపారు.