ఆ తేలు విషం.. గ్యాలన్‌కు 39 మిలియన్ డాలర్లు

దిశ, వెబ్‌డెస్క్: పాముల్లో.. అన్ని పాములు విషపూరితమైనవి కానట్లే, తేళ్లలో కూడా కొన్ని మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన తేళ్లలో ‘డెత్ స్టాకర్’ స్కార్పియన్ ఒకటి. అంతేకాదు దీని విషం కూడా అత్యంత ఖరీదైంది. క్లినికల్ ట్రయల్స్‌లో ఎంతో ఉపయోగపడే ఈ విషం.. ఒక్కో గ్యాలన్‌కు 39 మిలియన్ డాలర్లు (రూ. 2,86,17,96,600/-). డెత్ స్టాకర్ విషం.. పెప్టైడ్ క్లోరోటాక్సిన్స్‌ను కలిగి ఉండగా, ఈ టాక్సిన్స్ ఉపయోగించి హ్యుమన్ బ్రెయిన్ ట్యూమర్స్‌కు […]

Update: 2021-01-09 05:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాముల్లో.. అన్ని పాములు విషపూరితమైనవి కానట్లే, తేళ్లలో కూడా కొన్ని మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన తేళ్లలో ‘డెత్ స్టాకర్’ స్కార్పియన్ ఒకటి. అంతేకాదు దీని విషం కూడా అత్యంత ఖరీదైంది. క్లినికల్ ట్రయల్స్‌లో ఎంతో ఉపయోగపడే ఈ విషం.. ఒక్కో గ్యాలన్‌కు 39 మిలియన్ డాలర్లు (రూ. 2,86,17,96,600/-).

డెత్ స్టాకర్ విషం.. పెప్టైడ్ క్లోరోటాక్సిన్స్‌ను కలిగి ఉండగా, ఈ టాక్సిన్స్ ఉపయోగించి హ్యుమన్ బ్రెయిన్ ట్యూమర్స్‌కు చికిత్స అందించవచ్చు. అంతేకాదు ఇన్సులిన్ నియంత్రించడంలో, డయాబెటిస్‌ను తగ్గించడంలోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇవేకాక అనేక వైద్యచికిత్సలు, పరిశోధనల్లో ఉపయోగించడం వల్ల ఈ విషానికి అధిక డిమాండ్ ఏర్పడింది. అందుకే ఈ విషం కోసం రీసెర్చ్ లేబొరేటరీలు ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటాయి. ఒక అడల్ట్ డెత్ స్టాకర్ ఒకసారి 2 మిల్లీగ్రాములు విషాన్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుండగా, మళ్లీ దాంట్లో విషం ఉత్పత్తి కావడానికి 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. ఈ లెక్కన ఓ గ్యాలన్ విషం కావాలంటే.. ఎన్ని రోజులు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ జాతికి చెందిన తేళ్లు తక్కువ సంఖ్యలోనే ఉండటం, వైద్యశాస్త్రంలో ఎంతో ఉపయోగపడుతుండటం వల్లే మార్కెట్‌లో దీని విలువ ఒక గ్యాలన్‌కు 39 మిలియన్ డాలర్లుగా ఉంది.

అయితే ‘డెత్ స్టాకర్’ అత్యంత విషపూరితమైన తేలు అయినప్పటికీ, ఆరోగ్యవంతుడైన ఓ మనిషిని చంపేంత ప్రాణాంతకమైతే కాదు. అయితే తక్కువ రోగనిరోధక శక్తి, వీక్ హార్ట్ ఉన్నవారితో పాటు చిన్నపిల్లలు, వృద్ధులకు మాత్రం దీనివల్ల ప్రమాదమే. తేనెటీగ కుట్టినప్పటితో పోలిస్తే, ఈ తేలు కుట్టడం వల్ల అంతకు 100 రెట్ల బాధ అధికంగా ఉంటుంది. వీటిని ఇంట్లో పెంచుకోవాలంటే.. ప్రత్యేక లైసెన్స్ అవసరం కానుండగా, కొన్ని దేశాల్లో మాత్రం ఇంట్లో పెంచుకోవడం చట్టవిరుద్ధం.

Tags:    

Similar News