యావత్ దేశమే ఆశ్చర్యపోతోన్నది : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ, ఆదిలాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు రాష్ట్ర అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో సంవత్సరాల తరబడి పోరాటాలు చేయడంతోపాటు ఎంతో మంది అమరులు తమ ప్రాణాలను త్యాగం చేయడం వల్ల […]
దిశ, ఆదిలాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు రాష్ట్ర అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో సంవత్సరాల తరబడి పోరాటాలు చేయడంతోపాటు ఎంతో మంది అమరులు తమ ప్రాణాలను త్యాగం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామన్నారు. వారి త్యాగాలను వృథా పోనివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా రూపుదిద్దేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, టీఆర్ఎస్ ఆరేండ్ల పాలనపై ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన కేవలం ఆరేండ్లలో యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందున్నారు. కాళేశ్వర నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో నేడు తెలంగాణ ఎంతో సుభిక్షంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కె.విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, ఎస్పీ శశిధర్ రాజు, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పాల్గొన్నారు.