టీఆర్ఎస్ లీడర్ మా భూమి కాజేశాడు సార్.. జీవన్ రెడ్డి ఎదుట బాధితుల మొర
దిశ ప్రతినిధి, నిజామాబాద్/ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు తమ భూమిని కాజేయాలని చూస్తున్నాడని బాధితులు రచ్చకెక్కారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆదివారం కలిసి మొర పెట్టుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 401, ఫ్లాట్ నెంబర్ 157లో ప్రస్తుతం ఇందారపు రాజు నివాసం ఉంటున్నాడు. గత 70 సంవత్సరాలుగా తమ కుటుంబం ఇక్కడే కూలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ఈ భూమి […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్/ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు తమ భూమిని కాజేయాలని చూస్తున్నాడని బాధితులు రచ్చకెక్కారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆదివారం కలిసి మొర పెట్టుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 401, ఫ్లాట్ నెంబర్ 157లో ప్రస్తుతం ఇందారపు రాజు నివాసం ఉంటున్నాడు. గత 70 సంవత్సరాలుగా తమ కుటుంబం ఇక్కడే కూలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ఈ భూమి తన తండ్రి నరసయ్యకు పూర్వీకుల ద్వారా వచ్చిన వారసత్వ స్థిర ఆస్తి అంటున్నాడు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో నివాసముంటూ కూలిపని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న తమను టీఆర్ఎస్ నేత ఈ భూమి తమదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయమై తమకు న్యాయం చేయాలని ఇందారపు స్వప్న-రాజు, ఇందారపు వసంత-గోపితోపాటు మాదిగ కుల సంఘ నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మా నాన్న కొన్నారు : శ్రీనివాస్
జిరాయాత్ నగర్‌లోని సర్వే నెంబర్ 401, ఫ్లాట్ నెంబర్ 157లో ఉన్న స్థలాన్ని మా నాన్న కొన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు మా దగ్గర ఉన్నాయి. ఈ భూమి మాదంటూ కబ్జాలో ఉన్నవారు అంటున్నారు. ఈ విషయంలో మేము కోర్టులో ఫిర్యాదు చేశాం. ఇప్పుడు కబ్జాలో ఉన్నవారు మరో వ్యక్తికి అమ్మితే వారి నుంచి మా నాన్న కొన్నారు. అందుకు సంబంధించిన పత్రాలను చూపినా వాళ్లు వినడంలేదు.