శ్మశానవాటికలో ఆ ఇద్దరు.. రాత్రంతా…

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: శ్మశాన వాటిక… ఆపై చిమ్మ చీకటి అయినా ఇద్దరు కరుణ పేషెంట్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎన్మంబెట్ల గ్రామంలో శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా బారినపడడంతో వారిని పాఠశాలలో ఉండమని గ్రామ సర్పంచ్ నాగరాజు సూచించాడు. కానీ గ్రామస్తులు కొందరు పాఠశాలకు చుట్టుముట్టు ఉన్న మాకు ముప్పుతీసుకువస్తారా…? మీరు ఇక్కడ ఉండడానికి వీలులేదు అని కసురుకోవడంతో […]

Update: 2021-05-23 11:11 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: శ్మశాన వాటిక… ఆపై చిమ్మ చీకటి అయినా ఇద్దరు కరుణ పేషెంట్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎన్మంబెట్ల గ్రామంలో శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా బారినపడడంతో వారిని పాఠశాలలో ఉండమని గ్రామ సర్పంచ్ నాగరాజు సూచించాడు. కానీ గ్రామస్తులు కొందరు పాఠశాలకు చుట్టుముట్టు ఉన్న మాకు ముప్పుతీసుకువస్తారా…? మీరు ఇక్కడ ఉండడానికి వీలులేదు అని కసురుకోవడంతో ఆ షేషెంట్లు వాళ్ల ఇళ్లల్లో క్వారంటైన్ లో ఉండే అవకాశం లేక తప్పని పరిస్థితుల్లో గ్రామ సమీపంలో ఉన్న శ్మశాన వాటికకు శుక్రవారం సాయంత్రం చేరుకొని అక్కడ ఉన్న గదిలో తలదాచుకున్నారు. విద్యుత్ లేక చీకటిగా ఉన్నప్పటికీ వారిరువురు అక్కడే గడిపారు. శనివారం మధ్యాహ్నం కొంతమంది ఈ విషయాన్ని గుర్తించి మీడియాకు తెలియజేసే ప్రయత్నం చేయడంతో సర్పంచ్ కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుని తిరిగి పాఠశాలలోకి తీసుకెళ్లాడు. గ్రామస్తులు తిరిగి వారితో గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నించగా వారికి ఇబ్బంది కల్పిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సర్పంచ్ హెచ్చరించడంతో గ్రామస్తులు శాంతించారు.

Tags:    

Similar News