నిర్మల్ జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ధిక్కరణ ఆదేశాలు..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా కలెక్టర్ కి , జిల్లా పంచాయతీ అధికారికి హైకోర్టు ధిక్కరణ ఆదేశాలు జారీ చేసింది. నిర్మల్ జిల్లా ముథోల్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల తొలగింపు కేసులో హైకోర్టులో ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలం అయినందుకు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలిఫారుఖీ, జిల్లా పంచాయితీ అధికారి వెంకటేశ్వర్ రావుకి స్వయంగా కోర్టులో హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్, డీపీవోలు ఇద్దరు కూడా […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా కలెక్టర్ కి , జిల్లా పంచాయతీ అధికారికి హైకోర్టు ధిక్కరణ ఆదేశాలు జారీ చేసింది. నిర్మల్ జిల్లా ముథోల్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల తొలగింపు కేసులో హైకోర్టులో ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలం అయినందుకు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలిఫారుఖీ, జిల్లా పంచాయితీ అధికారి వెంకటేశ్వర్ రావుకి స్వయంగా కోర్టులో హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జిల్లా కలెక్టర్, డీపీవోలు ఇద్దరు కూడా తెలంగాణ హైకోర్టులో 27-04-2021న వ్యక్తిగతంగా హాజరు కావాలి. కోర్టుకు వచ్చి మీరు ఎందుకు శిక్షకు అర్హులు కారు అనే కారణాన్ని తెలపాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల్ని అమలు చేయుటలో విఫలం అయినందుకుగాను మీకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయబడతాయని ఆదేశాల్లో పేర్కొంది. ఈ కేసు మీపై ఉన్నందున మీ అభియోగం పై తుది ఉత్తర్వులు వచ్చేవరకు మీరు తప్పకుండ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది.