జైత్రయాత్ర ఆ డివిజన్ నుంచే మొదలవుతుంది

దిశ ప్రతినిధి , హైదరాబాద్: మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో మరో మారు టీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ నామినేషన్ దాఖలు సందర్భంగా అబిడ్స్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయానికి ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… గత నెలలో నగరంలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవ్వగా.. వారిని ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికీ రూ 10 వేల చొప్పున […]

Update: 2020-11-19 08:46 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్: మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో మరో మారు టీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ నామినేషన్ దాఖలు సందర్భంగా అబిడ్స్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయానికి ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… గత నెలలో నగరంలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవ్వగా.. వారిని ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికీ రూ 10 వేల చొప్పున ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.

ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేసి పేద ప్రజలకు వరద ముంపు సహాయం అందకుండా వారి నోటి కాడి కూడు లాక్కున్నాయని ఆమె ఆరోపించారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు నెలకు రూ 1500 చొప్పున సహాయం అందజేసిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్‌లు వరద బాధిత ప్రజలకు కనీస సహాయం చేయలేదనీ, గ్రేటర్ ఎన్నికల్లో వారికి ఓట్లు అడిగే హక్కు కూడా లేదన్నారు. గ్రేటర్ జైత్రయాత్ర గాంధీనగర్ డివిజన్ నుంచే మొదలవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News