ఆలయాలకు విరాళం ఇవ్వాలనుకుంటున్నారా.. వారికోసం ప్రత్యేక యాప్

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కారణంగా ఆలయాలు మూసివేయడంతో రాష్ట్రంలోని ఆలయాలకు భారీగా ఆదాయం తగ్గింది. ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో ఆలయాలు తెరుచుకోగా.. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్ఆర్ఐ భక్తుల నుంచి విరాళాలు రాబట్టేందుకు సిద్ధమైంది. ఆలయాలకు విరాళాలు ప్రకటించేందుకు ఇప్పటికే చాలామంది ఎన్ఆర్ఐలు ఆలయ అధికారులకు సంప్రదించారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా విరాళాలను డొనేట్ చేసేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ […]

Update: 2021-12-16 07:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కారణంగా ఆలయాలు మూసివేయడంతో రాష్ట్రంలోని ఆలయాలకు భారీగా ఆదాయం తగ్గింది. ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో ఆలయాలు తెరుచుకోగా.. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్ఆర్ఐ భక్తుల నుంచి విరాళాలు రాబట్టేందుకు సిద్ధమైంది. ఆలయాలకు విరాళాలు ప్రకటించేందుకు ఇప్పటికే చాలామంది ఎన్ఆర్ఐలు ఆలయ అధికారులకు సంప్రదించారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా విరాళాలను డొనేట్ చేసేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ఐటీశాఖ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్‌ ‘‘T APP FOLIO’’ ను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే, ఈ యాప్‌లో ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేకంగా ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ప్రస్తుతానికి యాదాద్రి, హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ, పెద్దమ్మ గుడి, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, కర్మాన్ ఘాట్ ఆలయాలకు విరాళం ఇవ్వొచ్చు. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని మరిన్ని ఆలయాలకు దీని ద్వారా విరాళాలు పంపించొచ్చని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News