జోన్ల వారీగా పోస్టులు ఖరారు.. ప్రభుత్వం ఉత్తర్వులు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరిస్తూ జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించింది. జిల్లా, జోనల్, మల్టీజోనల్ వారీగా పోస్టులను విభజించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు నియామకాల్లో కొత్త జోన్లు, మల్టీ జోన్లే ప్రామాణికం కానున్నాయి. ఇకపై చేపట్టనున్న నియామకాల ప్రకారం.. కానిస్టేబుళ్లు ఎంపికైన జిల్లాల వారీగా, ఎస్సైలు ఎంపికైన జోన్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఇన్‌స్పెక్టర్ ర్యాంకు ఆఫీసర్లు మల్టీజోన్లకు పరిమితం […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరిస్తూ జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించింది. జిల్లా, జోనల్, మల్టీజోనల్ వారీగా పోస్టులను విభజించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు నియామకాల్లో కొత్త జోన్లు, మల్టీ జోన్లే ప్రామాణికం కానున్నాయి. ఇకపై చేపట్టనున్న నియామకాల ప్రకారం.. కానిస్టేబుళ్లు ఎంపికైన జిల్లాల వారీగా, ఎస్సైలు ఎంపికైన జోన్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఇన్‌స్పెక్టర్ ర్యాంకు ఆఫీసర్లు మల్టీజోన్లకు పరిమితం కావాల్సి ఉంటుంది. అంటే ఇన్‌స్పెక్టర్లు మల్టీజోన్లలో ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ పని చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్పెక్టర్ ఆఫ్‌పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టులను మల్టీజోన్ కేడర్‌కు తీసుకొచ్చారు.
మల్టీజోన్ కేడర్
ఆర్డీవో, అసిస్టెంట్ సెక్రెటరీ, సూపరింటెండెంట్, తహశీల్దార్, ఇన్స్పెక్టర్ఆఫ్సర్వే(యూఎల్‌సీ), డిస్ట్రిక్ రిజిస్టార్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్, గ్రేడ్ –1 సబ్ రిజిస్టార్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్స్ రికార్డు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, అసిస్టెంట్ ఎగ్జిగ్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్ ఫర్ మేషన్ ఇంజినీర్, అడిషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్డైరెక్టర్, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్, కార్పొరేట్ సబ్ రిజిస్టార్ వంటి పోస్టులన్నీ మల్టీజోన్ కేడర్‌కు కేటాయించారు. పంచాయతీరాజ్‌లో గ్రేడ్ –1 పంచాయతీ కార్యదర్శిని జోనల్ పరిధికి తీసుకొచ్చారు. గ్రేడ్–1తో పాటుగా గ్రేడ్ –2, గ్రేడ్ –3, సానిటరీ ఇన్‌స్పెక్టర్ గ్రేడ్ –2, పంచాయతీ లైన్ మెన్, ఫిట్టర్‌ను జోనల్‌కు తీసుకువచ్చారు. మల్టీజోన్ పరిధిలోకి అకౌంట్ ఆఫీసర్స్, జిల్లా పంచాయతీ అధికారి, మండల ఇంజినీరింగ్ అధికారి(ఎంఈవో), డివిజనల్ పంచాయతీ అధికారి, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ ఎంపీఓలను చేర్చారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవోలు
3236306802 (1)