తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి సెలవులు రద్దు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు రోజూ అనేకమంది వైరస్ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ శాఖ పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో, పట్టణాల్లో పారిశుధ్య […]

Update: 2021-04-17 20:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు రోజూ అనేకమంది వైరస్ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ శాఖ పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. మాస్కులు, శానిటైజర్లు వాడేలా ప్రజలకు కరోనాపై పూర్తి అవగాహన కల్పించాలని వెల్లడించారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమిషనర్ ఎండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌లతో మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు.

Tags:    

Similar News