బోర్డుల మీటింగ్‌కు డుమ్మా కొట్టిన తెలంగాణ ప్రభుత్వం

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యాల జాయింట్​ మీటింగ్​కు ముందు నుంచి చెప్పినట్టే తెలంగాణ గైర్హాజరైంది. ఈ సమావేశానికి రాలేమంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు లేఖ రాసింది. కానీ బోర్డులు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. యథాతథంగా సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. దీనిలో భాగంగా సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి జలసౌధలో సంయుక్తంగా బోర్డుల సమావేశాన్ని మొదలుపెట్టారు. ఈ సమావేశానికి ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు ఇరిగేషన్​ ఇంజినీర్లు హాజరయ్యారు. తెలంగాణ […]

Update: 2021-08-09 01:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యాల జాయింట్​ మీటింగ్​కు ముందు నుంచి చెప్పినట్టే తెలంగాణ గైర్హాజరైంది. ఈ సమావేశానికి రాలేమంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు లేఖ రాసింది. కానీ బోర్డులు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. యథాతథంగా సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. దీనిలో భాగంగా సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి జలసౌధలో సంయుక్తంగా బోర్డుల సమావేశాన్ని మొదలుపెట్టారు. ఈ సమావేశానికి ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు ఇరిగేషన్​ ఇంజినీర్లు హాజరయ్యారు. తెలంగాణ తరుపున వాదనలు వినిపించారు. గెజిట్​కు తమ రాష్ట్రం స్వాగతం చెప్పినట్లు మరోసారి స్పష్టం చేశారు. ఇక తెలంగాణ నుంచి ఈఎన్సీ, ఇంజినీర్లు గైర్హాజరయ్యారు. ఈ మీటింగ్​కు కనీసం కీలకమైన ఇంజినీర్లను పంపించాలంటూ బోర్డు నుంచి మౌఖిక సమాచారమిచ్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు.

Tags:    

Similar News