అనుమానితులు ఐసోలేషన్‌కు వెళ్లాలి
దిశ, రంగారెడ్డి: ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు అనుమానాలున్నందున ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుందన్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు.. దయచేసి ఆరోగ్యశాఖ వారిని సంప్రదించి, కరోనా వ్యాప్తి జరగకుండా చికిత్స పొందాలని ఆయన కోరారు. ప్రభుత్వానికి సహకరించి […]
దిశ, రంగారెడ్డి: ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు అనుమానాలున్నందున ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుందన్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు.. దయచేసి ఆరోగ్యశాఖ వారిని సంప్రదించి, కరోనా వ్యాప్తి జరగకుండా చికిత్స పొందాలని ఆయన కోరారు. ప్రభుత్వానికి సహకరించి బాధ్యతగా ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకొని సమాజాన్ని రక్షించాలని వికారాబాద్ శాసన సభ సభ్యులు డాక్టర్. మెతుకు ఆనంద్ కోరారు.
Tags: mla Methuku Anand, request, corona suspects, rangareddy