మోడీ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బొర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి తొలగింపునకు గురైన జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ గత సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీఫామ్ పొందారు. కొన్ని కారణాలతో ఆయన నామినేషన్‌ను ఎలెక్షన్ కమిషన్ తిరస్కరించింది. అన్యాయంగా తన […]
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బొర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి తొలగింపునకు గురైన జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ గత సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీఫామ్ పొందారు. కొన్ని కారణాలతో ఆయన నామినేషన్‌ను ఎలెక్షన్ కమిషన్ తిరస్కరించింది.
అన్యాయంగా తన నామినేషన్‌ను తిరస్కరించాలని, ఎంపీగా నరేంద్ర మోడీ ఎన్నికను సవాల్ చేస్తూ అలహబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఉత్తరప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో తేజ్ బహద్దూర్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే నేతృత్వంలోని జస్టిస్ ఏఎస్ బొప్పన్న, జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని త్రిసభ ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. సరిహద్దుల్లో భద్రతా సిబ్బందికి సరైన ఆహారం అందించడం లేదని తేజ్ బహద్దూర్ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. క్రమశిక్షణను ఉల్లంఘించడంతో అతణ్ని సర్వీసు నుంచి తొలగిస్తూ 2017లో బీఎస్‌ఎఫ్ నిర్ణయం తీసుకున్నది.