మత మార్పిడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: మతమార్పిడులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని స్పష్టం చేసింది. దేశంలో పౌరులకు ఇష్టం వచ్చిన మతం అనుసరించే స్వేచ్ఛ ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిడుల కట్టడికి ప్రభుత్వాలను ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది. అంతేగాకుండా.. బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పిటిషన్‌ను […]

Update: 2021-04-09 04:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: మతమార్పిడులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని స్పష్టం చేసింది. దేశంలో పౌరులకు ఇష్టం వచ్చిన మతం అనుసరించే స్వేచ్ఛ ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిడుల కట్టడికి ప్రభుత్వాలను ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది. అంతేగాకుండా.. బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పిటిషనర్‌ ఉపాధ్యాయ్‌కు హెచ్చరికలు జారీ చేసింది.

Tags:    

Similar News