ధాన్యం ఉత్ప‌త్తిలో దేశంలోనే రాష్ట్రం నంబ‌ర్‌వ‌న్‌: కవిత

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్‌ జనరల్‌ సారా కిర్లూతో శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తెలంగాణలో పారిశ్రామిక రంగ ప్రగతికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రపంచ స్థాయి పారిశ్రామిక పాలసీని అమలు చేస్తోందని, కరోనా సమయంలోనూ 1700 కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి కనబరిచాయని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక […]

Update: 2021-06-04 11:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్‌ జనరల్‌ సారా కిర్లూతో శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తెలంగాణలో పారిశ్రామిక రంగ ప్రగతికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రపంచ స్థాయి పారిశ్రామిక పాలసీని అమలు చేస్తోందని, కరోనా సమయంలోనూ 1700 కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి కనబరిచాయని తెలిపారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలోనే పారిశ్రామిక రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని కవిత చెప్పారు. ధాన్యం ఉత్ప‌త్తిలో, వ్యవసాయ రంగంలోనూ దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని వివరించారు. ఎంపీగా ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో పర్యటించిన సందర్భంలో అక్కడి విధానాలు, పద్దతులను అభినందించారు. ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ప్రజా సంబంధాలు, వాణిజ్య, వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. చర్చలతోనే ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమవుతుందని తెలిపారు. తెలంగాణ అనేక పర్యాటక ప్రాంతాలకు నెలవని, హైదరాబాద్ లో పర్యటించాలని సారా కిర్లూను ఆహ్వానించారు.

Tags:    

Similar News