ప్రాణాలు కాపాడిన' షీ' టీమ్

దిశ, మహబూబాబాద్ : ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా శుక్రవారం మహబూబాబాద్ షీ టీమ్ పోలీసుల బృందం ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన సుజాత అనే మహిళ 10 సంవత్సరాల క్రితం తన భర్త నుండి విడాకులు తీసుకుంది. గత కొద్ది నెలల క్రితం సోదరుడు మృతి చెందగా, అప్పటి నుండి ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంది. మానసికంగా కృంగిపోతు జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు సిద్ధపడి మహబూబాబాద్ […]

Update: 2021-03-19 04:49 GMT
ప్రాణాలు కాపాడిన షీ టీమ్
  • whatsapp icon

దిశ, మహబూబాబాద్ : ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా శుక్రవారం మహబూబాబాద్ షీ టీమ్ పోలీసుల బృందం ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన సుజాత అనే మహిళ 10 సంవత్సరాల క్రితం తన భర్త నుండి విడాకులు తీసుకుంది. గత కొద్ది నెలల క్రితం సోదరుడు మృతి చెందగా, అప్పటి నుండి ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంది.

మానసికంగా కృంగిపోతు జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు సిద్ధపడి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రాక్ పై నడుచుకుంటూ వెళుతుంది. అదే సమయంలో అటుగా పెట్రోలింగ్ చేస్తున్న షీ టీమ్ ఎస్సై బాలకృష్ణ.. మహిళను చూసి హుటాహుటిన అక్కడి చేరుకొని ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించి ప్రాణాలు కాపాడారు.

 

Tags:    

Similar News