కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదలకు అన్యాయం చేసేలా ఉందని గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతుకూలీ సంఘం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య ఆధ్వర్యంలో రైతు కూలీలు ఈ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వామపక్షాలు […]
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదలకు అన్యాయం చేసేలా ఉందని గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతుకూలీ సంఘం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య ఆధ్వర్యంలో రైతు కూలీలు ఈ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వామపక్షాలు ఐక్యంగా కేంద్రంపై పోరాటం చేసేందుకు సన్నద్ధం అవుతున్నాయని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.