సహారా గ్రూప్ ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు!
ముంబయి: కరోనా సంక్షోభాన్ని అధిగమించి ఉద్యోగాల తొలగింపు, వేతనాల కోత అమలు చేయని కంపెనీల జాబితాలోకి సహారా గ్రూప్ సైతం చేరింది. తమ కంపెనీలో ఎవరినీ తొలగించే ప్రసక్తే లేదని, అంతేకాకుండా ఉద్యోగులకు జీతాలను పెంచుతామని, ప్రమోషన్లు ఇస్తామని స్పష్టం చేసింది. సహారా గ్రూప్ కంపెనీలో ఉన్న ఏ ఉద్యోగినీ తొలగించబోమని, కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిన వలస కార్మికులకు ఉపాధిని కూడా అందించనున్నట్టు పేర్కొంది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ భద్రతా […]
ముంబయి: కరోనా సంక్షోభాన్ని అధిగమించి ఉద్యోగాల తొలగింపు, వేతనాల కోత అమలు చేయని కంపెనీల జాబితాలోకి సహారా గ్రూప్ సైతం చేరింది. తమ కంపెనీలో ఎవరినీ తొలగించే ప్రసక్తే లేదని, అంతేకాకుండా ఉద్యోగులకు జీతాలను పెంచుతామని, ప్రమోషన్లు ఇస్తామని స్పష్టం చేసింది. సహారా గ్రూప్ కంపెనీలో ఉన్న ఏ ఉద్యోగినీ తొలగించబోమని, కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిన వలస కార్మికులకు ఉపాధిని కూడా అందించనున్నట్టు పేర్కొంది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ భద్రతా పరమైన పరిసరాల్లోనే విధులు నిర్వహిస్తున్నారని, క్షేత్ర స్థాయిలో 4 లక్షల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చినట్టు, మరో 4,800 మందికి ప్రమోషన్‌తో పాటు వేతనాల్లో ఇంక్రిమెంట్లు ఇచ్చినట్టు సహారా తెలిపింది. సహారా గ్రూప్‌లో పని చేసే ఉద్యోగుల జీవనోపాధికి ప్రాధాన్యత ఇస్తామని, ఈ అంశంపై సహారా గ్రూప్‌లోని పలు వ్యాపార సంస్థలకు తెలియజేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఇక, కరోనా వల్ల వివిధ రాష్ట్రాల నుంచి యూపీకి వెళ్లిన వలస కూలీలకు స్థానికంగా అర్హతలను బట్టి సహారా గ్రూప్ సంస్థల్లో ఉపాధి కల్పించనునంట్టు చీఫ్ సుబ్రతా రాయ్ పేర్కొన్నారు. సహారా గ్రూప్‌లో మొత్తం 14 లక్షల మంది ఉద్యోగులున్నారు.