నర్కూడ లో విద్యుత్ సమస్య పరిష్కరించాలి : నీరటి రాజు ముదిరాజ్

దిశ, రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడలో కరెంటు సమస్యల వల్ల విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ టీఆర్ఎస్ జిల్లా నాయకుడు నీరటి రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో మైలార్‌దేవ్‌పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. రాత్రింబవళ్లు ఎప్పుడు పడితే అప్పుడు నర్కూడ గ్రామంలో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయని ఎన్నిసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా […]

Update: 2021-07-26 08:54 GMT

దిశ, రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడలో కరెంటు సమస్యల వల్ల విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ టీఆర్ఎస్ జిల్లా నాయకుడు నీరటి రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో మైలార్‌దేవ్‌పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. రాత్రింబవళ్లు ఎప్పుడు పడితే అప్పుడు నర్కూడ గ్రామంలో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయని ఎన్నిసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు.

కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు అందిస్తున్నామని అన్నారు. గ్రామంలో విద్యుత్ కోతల సమస్యపై విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి మరోసారి విద్యుత్ సమస్య లేకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ సతీష్, నాయకులు శ్రీనివాస్, శేఖర్, మహేష్ కుమార్, కృష్ణ, అశోక్, విశ్వనాథం, శివాజీ, చంద్రశేఖర్, కుమార్ గౌడ్, వెంకటయ్య, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News